AP 10th Exams 2025: ఏపీలో ప్రస్తుతం ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు మార్చ్ 15తో ముగియనున్నాయి. అనంతరం మార్చ్ 17 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మొదలౌతాయి. పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చ్ 17 నుంచి మొదలై ఏప్రిల్ 1 వరకు జరగనున్నాయి. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మద్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రంలో మొత్తం 6 లక్షల 19 వేల 275 మంది విద్యార్ధులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3450 పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 విధించారు. పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
ఏపీ పదో తరగతి పరీక్షల టైమ్ టేబుల్
మార్చ్ 17 సోమవారం ఫస్ట్ లాంగ్వేజ్
మార్చ్ 19 బుధవారం సెకండ్ లాంగ్వేజ్
మార్చ్ 21 శుక్రవారం ఇంగ్లీషు
మార్చ్ 22 శనివారం ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2, ఓఎస్ఎస్‌సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1
మార్చ్ 24 సోమవారం మేథ్స్
మార్చ్ 26 బుధవారం ఫిజికల్ సైన్స్
మార్చ్ 28 శుక్రవారం బయోలాజికల్ సైన్స్
మార్చ్ 29 శనివారం ఓఎస్ఎస్‌సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2
మార్చ్ 31లేదా ఏప్రిల్ 1 సోషల్ స్టడీస్
వీటిలో ఫిజికల్స్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతాయి. మిగిలినవి యధాతధంగా జరగనున్నాయి. మార్చ్ 31 రంజాన్ పండుగ ఉంటే ఏప్రిల్ 1న చివరి పరీక్ష సోషల్ స్టడీస్ ఉంటుంది. ఒకవేళ ఏప్రిల్ 1 పండుగైతే మాత్రం మార్చ్ 31నే సోషల్ స్డడీస్ పరీక్ష పూర్తవుతుంది.
Also read: Ys Jagan Coterie: సాయిరెడ్డి చెప్పిన ఆ కోటరీ ఎవరు, వైవీ సుబ్బారెడ్డిని వైఎస్ ఎందుకు చేరనివ్వలేదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









