AP MLC Elections: ఆంధ్ర ప్రదేశ్ లో రీసెంట్ గా జరిగిన ఎమ్మెల్సీ స్థానల్లో ఒక స్థానంలో కూటమికి షాక్ తగలింది. కానీ మరో రెండు స్థానాల్లో కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్ధులు గెలవడం పెద్ద ఊరట. ఆ సంగతి పక్కన పెడిత.. ఏపీ ఎమ్మెల్సీ నగారా మోగిన సందర్భంగా గతంలో కాపు నేత ఉద్యోగుల సంఘ నాయకుడు పరుచూరి అశోక్ బాబు ఎమ్మెల్సీ గా ఆయన పదవీ కాలం ముగియనుంది. ఈ సందర్భంగా ఆ స్థానంలో తెలుగు దేశం పార్టీ నుంచి అదే సామాజిక వర్గానికి అదే జిల్లాకి చెందిన స్వర్గీయ వంగవీటి మోహన రంగా కుమారుడు వంగవీటి రాదా కృష్ణ ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయనున్నారు. అటు జనసేన నుండి నాగేంద్ర బాబు పేర్లు దాదాపు ఖరారయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకు వచ్చే క్యాబినేట్ విస్తరణలో మంత్రి పదవి ఇవ్వనున్నట్టు చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. గతంలో నాగబాబును రాజ్యసభకు పంపిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా బీజేపీ ఒక స్థానం.. మరో రెండు స్థానాలను తెలుగు దేశం పార్టీ తీసుకోవడంతో నాగబాబుకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చి.. మంత్రిని చేయనున్నారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
ఒక వేళ ఇద్దరికీ స్థానాన్ని కల్పించేటట్లయితే పదవీకాలం ముగిసిన బీటీ నాయుడు స్థానాన్ని రాజకీయ కూర్పులో భాగం ఎమ్మెల్సీ సీటు ఇవ్వనున్నట్టు సమాచారం. పదవి కాలం ముగిసిన బీసీ నేత యనమల రామకృష్ణుడు సామాజిక వర్గం నుండి ఇప్పటికే శాసన సభలో క్యాబినెట్ చోటు దక్కిన తరుణంలో ఆ స్థానాన్ని మరో బీసీ సామాజికవర్గ నాయకుని కట్టబెట్టే అలోచనలో టీడీపీ ఉందనట్లు తెలుస్తోంది. గతంలో ఎమ్మెల్సీ పని చేసిన వారికి కాకుండా కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ పార్టీ శ్రేణుల్లో కూడా ఉంది
మరో తెలుగు దేశం పార్టీ నాయకుడు బీసీ సామాజికవర్గానికి చెందిన దువ్వారపు రామారావు పదవి కాలం ముగిసింది. అంతేకాదు ఆ సామాజికవర్గానికి ఇప్పటికే శాసన సభలో చోటు దక్కటంతో చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో సీట్ల కూర్పులో ఇచ్చిన హామీల్లో మొదటిది బహిరంగ ప్రకటన చేసిన తొలి శాసన మండలి స్థానం పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొమ్మాలపాటికి ఇప్పటికే ఖరారు చేసారు. ఈ విధంగా చంద్రబాబు తను ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నట్లు తెలుస్తోంది. డాక్టర్ కొమ్మాలపాటి ఎటువంటి వివాదం లేకుండా తన నియోజవర్గంతో పాటు పల్నాడు జిల్లా 7 స్థానాలు గెలుపుకు గట్టి కృషి చేసారు. చంద్రబాబు ఎన్నికల హామీలో ప్రకటించిన రెండు ఎమ్మెల్సీలలో రెండవది పిఠాపురం టీడీపీ నేత ఎస్ వి ఎస్ వర్మ కు ఖరారు చేసినట్లు సమాచారంమొత్తానికి చంద్రబాబు హామీ ఇచ్చిన డాక్టర్ కొమ్మాలపాటి, పిఠాపురం వర్మ, కొణిదల నాగబాబుల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం లాంఛనమే అని చెప్పాలి. మరోవైపు కూటమి ప్రభుత్వం నామినేటేడ్ పదవుల్లో కూడా కూటమి నేతలకు తగిన ప్రాధాన్యం ఇస్తోంది.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









