
Heavy Rainfall Alert: మండు వేసవిలో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. మండే ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు భారీ ఊరట లభించనుంది. ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న5 రోజులు ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
ఏపీ, తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఓ వైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరోవైపు వడగాలులు భయపెడుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ నుంచి కూల్ న్యూస్ అందుతోంది. భగభగమండే ఎండల్నించి ప్రజలకు ఉపశమనం కలగనుంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి మద్య మహారాష్ట్ర వరకూ ఉపరితల ఆవర్తనం తుపాను లాంటిది విస్తరించింది. సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఈ తుపాను ఆవర్తనం మద్య మహారాష్ట్ర పరిసరాల్లో కొనసాగుతూ ఛత్తీస్‌గఢ్ నుంచి మహారాష్ట్ర వరకూ 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణికి కారణమైంది. ఫలితంగా రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. రేపు అంటే గురువారం నాడు నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బలమైన ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో వర్షాలు పడనున్నాయి. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి.
వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రైతులు , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వర్షాల కారణంగా తెలంగాణలో పగటి ఉష్ణోగ్రత 2-4 డిగ్రీలు తగ్గనున్నాయి. వర్షాలు రైతులకు అనుకూలమే అయినా వడగండ్లు, ఈదురు గాలుల కారణంగా నష్టం వాటిల్లవచ్చు.
ఇక ఏపీలో కూడా రానున్న 5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. రాష్ట్రమంతటా మేఘాలు ఆవహించి ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. మరీ ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ వెల్లడించింది. బంగాళాఖాతంలో గాలి వేగం గంటకు 20 కిలోమీటర్లు ఉంటే ఏపీలో గంటకు 12 కిలోమీటర్లు ఉంటుంది. తెలంగాణలో గంటకు 16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఏపీలో పగటి ఉష్ణోగ్రతలు కాస్త తగ్గనున్నాయి. ఇవాళ వర్షాలు అంతగా లేకపోయినా రేపు అంటే గురువారం నుంచి వర్షాలు పెరగవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి