AP Assembly Speaker: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఈ క్రమంలో వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగచాటుగా సంతకాలు చేసి వెళ్లిపోతున్నారంటూ ఆరోపణలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినంతసేపు మాట్లాడకుండా చివర్లో ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయమేననే విమర్శలు విన్పిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ఇవాళ ఆఖరి రోజు. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకుండా దొంగచాటుగా సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని ఆరోపించారు. తనకు తెలియకుండా అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు పెట్టి వెళ్లిపోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రశ్నలు వేయడమే తప్ప సభకు రావడం లేదని మండిపడ్డారు. సంతకాలు పెట్టిన వాళ్లు తనకు సభలో కన్పించలేదని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సభ్యులు ఇప్పటికైనా సగర్వంగా సభకు హాజరు కావాలని అయ్యన్నపాత్రుడు సూచించారు.
మరోవైపు ఇవాళ అసెంబ్లీ సమావేశాల చివరి రోజున సభలో ఎస్సీ వర్గీకరణ నివేదికను ప్రవేశపెట్టనున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో ఏర్పాటైన ఏకసభ్య కమీషన్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై నివేదిక అందించింది. తెలంగాణలో మాదిరిగా ఇక్కడ కూడా ఎస్సీ వర్గీకరణను మూడు కేటగిరీల్లో విభజించింది. గ్రూప్ 1, 2,3 కేటగిరీల్లో రెల్లి, మాదిగ, మాల ఉపకులాలను వర్గీకరించారు.
ఇంకోవైపు శాసన మండలిలో ఛైర్మన్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్సీలపై కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తనతో పాటు మండలి ఛైర్మన్ మోషేన్ రాజును సైతం అవమానించారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఫోటోకు పిలిచి తనకు, మండలి చైర్మన్‌కు కనీసం కుర్చీ వేయకుండా అగౌరవపరిచారన్నారు.
Also read: AP Metro Projects: ఏపీకు గుడ్‌న్యూస్, విజయవాడ, విశాఖ మెట్రోలకు కేంద్రం నిధులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









