AP BJP Leadership: ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ప్రస్తుతం చిన్నమ్మ అలియాస్ పురంధరేశ్వరి ఉంది. ఏపీలో బీజేపీ ఎప్పుడు గెలిచినా తెలుగుదేశం, జనసేనతో కలిసి పోటీ చేసినప్పుడే. ఒంటరిగా ఆ ఆ పార్టీ ఎప్పుడూ ఒక్క సీటు కూడా గెలవలేకపోతోంది. ఓటర్లను ప్రభావితం చేసే నాయకత్వం ఆ పార్టీకు కరువైంది. ఇప్పుడు కాదు..ముందు నుంచీ ఇదే పరిస్థితి.
ఏపీలో బీజేపీకు ముందు నుంచీ నాయకత్వ సమస్య ఉంది. ఏపీలో బీజేపీ ఎప్పుడు గెలిచినా తెలుగుదేశంతో లేదా టీడీపీ-జనసేనతో కలిసి పోటీ చేసినప్పుడే. బీజేపీ ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఒక్క సీటు గెలవలేకపోతోంది. 2019 ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి. ఇప్పటి బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి విశాఖపట్నం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో మోదీ చరిష్మా కూడా పనిచేయలేదు. ఈమె కంటే ముందు రాష్ట్రంలోని బలమైన సామాజికవర్గంగా ఉన్న కాపు వర్గం నుంచి కన్నా లక్ష్మీ నారాయణ, సోము వీర్రాజు పార్టీ అధ్యక్షులుగా పనిచేసినా ఓటు బ్యాంకు ఏ మాత్రం పెరగలేదు. కమ్మ సామాజికవర్గం నుంచి పురంధరేశ్వరి పార్టీ నేతృత్వం వహించినా ఎలాంటి మార్పు రాలేదు. అందుకే ఇప్పుడు మరోసారి నాయకత్వం మార్చేందుకు పార్టీ సిద్ధమౌతోంది.
మరి చిన్నమ్మ స్థానంలో ఎవరికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారనేది తేలడం లేదు. ఇంకా ఎలాంటి స్పష్టత లేకపోయినా ఒకరి పేరు మాత్రం బలంగా విన్పిస్తోంది. అది టీడీపీ నుంచి బీజేపీలో చేరి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న మాజీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి. కమ్మ సామాజికవర్గ నేపధ్యంతో పాటు ఆర్ధికంగా బలమైన వ్యక్తి కావడంతో పార్టీని నడిపిస్తాడనే భావన ఉంది. అయితే ప్రస్తుత పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా అదే సామాజిక వర్గం కావడంతో ఈసారి బీసీలకు కేటాయించాలని కొందరి వాదన. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాపు సామాజికవర్గానికి, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు కమ్మ సామాజికవర్గానికి చెందినవారు కావడంతో బీజేపీ అధ్యక్షునిగా బీసీ అయితే ఓటు బ్యాంకును ఆకర్షించవచ్చనేది మరో వాదన.
ఏదేమైనా త్వరలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు చిన్నమ్మను తప్పించడం మాత్రం ఖాయంగా కన్పిస్తోంది. పొరుగున తెలంగాణలో కూడా పార్టీ అధ్యక్ష మార్పు ఉంటుందనే వాదన విన్పిస్తోంది. రెండు రాష్ట్రాలకు ఒకేసారి అధ్యక్షుల్ని మార్చే ఆలోచన లేకపోలేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









