Jr NTR: బీజేపీలోకి జూనియర్ ఎన్టీఆర్..? చక్రం తిప్పిన మేనత్త పురంధేశ్వరి..!

Daggubati Purandeswari On Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌పై ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి ప్రశంసలు కురిపించారు..! నందమూరి కుటుంబంలో మిగిలిన వారికి భిన్నంగా తన మేనల్లుడికి మేనత్త బహిరంగంగా మద్దతు ఇచ్చారు. మేనల్లుడిని బీజేపీలోకి లాగేందుకు పురంధేశ్వరి ప్రయత్నిస్తున్నారా..! అటు జూనియర్ ఎన్టీఆర్ కూడా కమలం పార్టీకి దగ్గర అయ్యే ఛాన్స్ ఉందా..! ఈ విషయంలో పురంధేశ్వరి కామెంట్స్‌ కీలకంగా మారబోతున్నారా..!  

Written by - Ashok Krindinti | Last Updated : May 18, 2025, 09:44 PM IST
Jr NTR: బీజేపీలోకి జూనియర్ ఎన్టీఆర్..? చక్రం తిప్పిన మేనత్త పురంధేశ్వరి..!

Daggubati Purandeswari On Jr NTR: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఇటీవల హీరో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో తనకు ఉన్న సాఫ్ట్ కార్నర్‌ను మరోసారి బయటపెట్టారు. తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ అలాగే సోదరులు హరికృష్ణ, బాలకృష్ణ తరహాలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా సినిమాల పట్ల అంకితభావంతో పని చేసి తన ఉనికిని చాటుకున్నారని చెప్పారు. ఇటీవల నందమూరి కుటుంబం నుంచి నాలుగోతరం నటుడిగా తారక రామారావు నటిస్తున్న సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా పురంధేశ్వరి చేసిన కామెంట్స్‌ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అటు జూనియర్ ఎన్టీఆర్ తనను అత్తగా గౌరవిస్తాడని, తన కుమారుడితో క్లోజ్‌గా ఉంటాడని గతంలో చిన్నమ్మ ఒక సందర్భంలో చెప్పారు. దాంతో జూనియర్‌ ఎన్టీఆర్‌కు తమ ఫుల్ సపోర్ట్‌ ఉందని చెప్పకనే చెప్పేశారు.
 
తాజాగా నందమూరి కుటుంబ సభ్యులు అందరి సమక్షంలోనే బహిరంగంగా ఆమె జూనియర్ ఎన్టీఆర్ పేరును మరోసారి ప్రస్తావించారు. అంతేకాకుండా అల్లుడిపై ప్రశంసలు కురిపించడం ఆసక్తికరంగా మారింది‌. దీంతో మిగిలిన నందమూరి కుటుంబ సభ్యులకు భిన్నంగా దగ్గుబాటి పురంధరేశ్వరి తన మేనల్లుడైన జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానంగా చూస్తున్నారని మరోసారి రుజువైంది.  ఇదే సందర్భంలో ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ను తమ పార్టీకి దగ్గర చేసే ఛాన్స్ కూడా ఉందనే చర్చ జరుగుతోంది. 
 
ఇదిలా ఉంటే గతంలో జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు.  ట్రిపుల్ ఆర్ మూవీ ఆస్కార్ అవార్డులు పొందిన సందర్భంగా అమిత్ షా  ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ ను పిలిపించుకొని ప్రశంసించారు. ఆ సమయంలో బీజేపీకి ఎన్టీఆర్ సపోర్ట్ అంటూ పలు ఊహాగానాలు వెలువడ్డాయి.‌ అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదు. మరోవైపు టిడిపితో ఆయనకు ఏర్పడిన గ్యాప్ అలాగే ఉంది. చంద్రబాబు తర్వాత భవిష్యత్తు టిడిపి అధినేతగా ఇప్పటికే నారా లోకేష్ పూర్తిస్థాయిలో రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ రానున్న రోజుల్లో టీడీపీకి కాకుండా జాతీయ పార్టీ బిజెపికి దగ్గరయ్యే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం సాగుతోంది.. 
 
మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపికి ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  పెద్ద అండగా ఉన్నారు. ప్రధాని మోదీ సహా ఢిల్లీ బిజెపి పెద్దలతో అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. 2029 ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్  తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా తమకు మద్దతుగా ఉండాలని బిజెపి కేంద్ర పెద్దలు ఆలోచించే అవకాశాలు కూడా ఉన్నాయి.‌ ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఇప్పటివరకు ప్రత్యేక అభిమానం చూపుతున్న అతడి మేనత్త దగ్గుబాటి పురంధేశ్వరి కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. నందమూరి కుటుంబంలో మిగిలిన వారితో ఎలా ఉన్నా తన పట్ల ప్రత్యేక అభిమానం చూపిస్తున్న మేనత్త మాటను భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ కాదనలేరు అనే  విధంగా పరిస్థితులు మారతాయా....? మేనల్లుడికి అత్త సపోర్ట్ రానున్న రోజుల్లో రాజకీయంగానూ.. రానున్న ఎన్నికల్లో  కీలకంగా మారిపోతుందా .. చూడాలి మరి..! 

Also Read: Jyoti Malhotra Net Worth: పాకిస్తాన్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన జ్యోతి మల్హోత్రా నెల సంపాదన ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగిపొద్ది..!!  

Also Read: IPL 2025 PBKS vs RR: హ్యాట్రిక్‌ విజయంతో పంజాబ్‌ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు.. రాజస్థాన్‌ కథ కంచికి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

 ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

Trending News