)
AP Cabinet: ఆంధ్ర ప్రదేశ్ క్యాబినేట్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్ సహా క్యాబినేట్ సహచరులు ఈ భేటిలో పాల్గొననున్నారు. ఇటు పాలనతో పాటు అటు రాజధాని అమరావతి నిర్మాణంపై కూడా వేగం పెంచింది కూటమి ప్రభుత్వం. అమరావతి సహా ఏపీ అభివృద్ధి అంశాలపై ప్రధానంగా చర్చించేందుకు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది.
అమరావతి రాజధాని నిర్మాణంలో ఫేజ్ 2 భూసేకరణపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. అలాగే సీఆర్డీయే 46వ అథారిటీలో ఆమోదించిన అంశాలన్నింటికీ ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం సీఆర్డీయే కమిషనర్ నిధులు సమీకరించుకునే అంశంపై మంత్రులు చర్చించనున్నారు. అనంతరం నిధుల సమీకరణకు క్యాబినెట్ అనుమతి ఇవ్వనుంది. అలాగే ఉండవల్లి, పెనుమాక రైతుల జరీబు భూములకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చే అంశంపై సీఆర్డీయే అథారిటీ తీసుకున్న నిర్ణయానికి క్యాబినెట్లో అనుమతి లభించనుంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ నూతన అసెంబ్లీ, హైకోర్ట్ భవనాల టెండర్లకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. 5వ ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదించిన అంశాలకు సైతం క్యాబినెట్లో గ్రీన్ సిగ్నల్ పడనుంది. కొత్తగా 30 వేల 667 కోట్ల పెట్టుబడులు.. 32 వేల 133 ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలకూ ఆమోదముద్ర వేయనున్నారు మంత్రులు. అలాగే రాజధానిలో ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూకేటాయింపులు చేసే అంశంపైనా చర్చించి ఆమోదం తెలపనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe