AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వేగం పెంచారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తి కావడంతో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అమరావతి అభివృద్ధి పనులు వేగవంతం చేసే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవాళ జరగనున్న కేబినెట్ భేటీ అత్యంత కీలకం కానుంది.
ఏపీలో కూటమి ప్రభుత్వ ఏర్పడిన తరువాత పూర్తి స్థాయి బడ్జెట్ రూపకల్పన పూర్తయింది. కొత్త ఆర్ధిక సంవత్సరం నుంచి వివిధ సంక్షేమ పథకాల అమలుపై చర్చ జరుగుతోంది. అమరావతి పనులకు సంబంధించి కీలక నిర్ణయాలకు ఇవాళ చంద్రబాబు నేతృత్వంలో జరగనున్న కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన తరువాత మద్యాహ్నం కేబినెంట్ భేటీ జరగనుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు కేబినెట్ భేటీలో ఆమోదం తెలుపనున్నారు. సీఆర్డీయే చేపట్టనున్న పలు అమరావతి అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ లభించనుంది.
సీఆర్డీఏ అథారిటీ ఆమోదించిన 37,702 కోట్ల టెండర్ల పనులకు కేబినెట్ ఆమోదం లభించనుంది. కేబినెట్ ఆమోదంతో టెండర్లు దక్కించుకున్న సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు జారీ కానున్నాయి. అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపట్టిన మరో 15,081 కోట్ల విలువైన 37 పనులకు కేబినెట్ ఆమోదించనుంది. రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు జరగనున్నాయి. మొత్తం 10 సంస్థల నుంచి వచ్చే 1,21,659 కోట్ల పెట్టుబడులను కేబినెట్ ఆమోదించనుంది.
విశాఖపట్నంలో లూలూ గ్లోబల్ ఇంటర్నేషనల్ సంస్థ 1500 కోట్ల పెట్టుబడులతో తలపెట్టిన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు, సత్యవీడు రిజర్వ్ ఫారెస్ట్ ఇన్‌ఫ్రాసిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ శ్రీసిటీలో పెట్టనున్న 25 వేల కోట్ల పెట్టుబడులకు ఏపీ మంత్రిమండలి ఆమోదించనుంది. ఇండోసాల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 58,469 కోట్ల పెట్టుబడులకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ నెల్లూరు జిల్లా నాయుడుపేటలో తలపెట్టిన 1742 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించనుంది. దాల్మియా సిమెంట్ సంస్థ కడప జిల్లాలో 2,883 కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదించనుంది.
Also read: UAN Number: యూఏఎన్ నెంబర్ గుర్తు రావడం లేదా, ఆన్‌లైన్‌లో ఇలా తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి