Amaravati ORR Railway Line: అమరావతి చుట్టూ భారీ ప్రణాళిక, ఓఆర్ఆర్ వెంబడి కొత్తగా రైల్వే లైన్

Amaravati ORR Railway Line: ఏపీ రాజధాని అమరావతి చుట్టూ ప్రభుత్వం వివిధ రకాల ప్రణాళికలు రచిస్తోంది. భవిష్యత్ అవసరాలను పరిగణలో ఉంచుకుని ఔటర్ రింగ్ రోడ్‌తో పాటే సబ్ అర్బన్ రైల్వే లైను నిర్మించేందుకు సిద్ధమౌతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 16, 2025, 05:27 PM IST
Amaravati ORR Railway Line: అమరావతి చుట్టూ భారీ ప్రణాళిక, ఓఆర్ఆర్ వెంబడి కొత్తగా రైల్వే లైన్

Amaravati ORR Railway Line: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవిష్యత్ అవసరాలు పరిగణలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం సబ్ అర్బన్ రైల్వే లైన్ నిర్మించ తలపెట్టింది. ఓఆర్ఆర్ ‌ పాటు రైల్వే లైన్ కోసం భూ సేకరణకు అనుమతించమని జాతీయ రహదారుల శాఖను కోరింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

అమరావతి రాజధాని చుట్టూ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఔటర్ రింగ్ రోడ్డును 150 మీటర్ల వెడల్పుతో భూ సేకరణకు అనుమతించాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. ఓఆర్ఆర్ వెంటే రైల్వే లైన్, సబ్ అర్బన్ రైళ్ల రాకపోకల కోసం భూ సేకరణకు అనుమతించాలని కోరింది. అయితే రైల్వే లైన్ కోసం భూసేకరణ తమ పరిధిలోనిది కాదని, రైల్వే శాఖను సంప్రదించాలంటూ జాతీయ రహదారుల శాఖ నిరాకరించింది. జాతీయ రహదారుల శాఖ ఔటర్ రింగ్ రోడ్ కోసం 70 మీటర్ల వెడల్పుతో భూ సేకరణకు అనుమతించగా అది సరిపోదని 150 మేర ఉండేలా అనుమతించాలని కోరింది. ఈ కొత్త ఓఆర్ఆర్ రాష్ట్రంలోని ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఏలూరు జిల్లా పరిధిలో 189.9 కిలోమీటర్ల మేరు ఆరు లైన్ల యాక్సెస్ కంట్రోల్ రోడ్‌గా ఉంటుంది. 1702 ఎకరాల భూ సేకరణకు అనుమతించింది. నిర్మాణ వ్యయం, భూ సేకరణ, ఇతర ఖర్చులు కలిపి 16,310 కోట్లుగా నిర్ణయించారు. 

కేంద్ర ప్రభుత్వం 70 మీటర్ల వెడల్పుతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం భూ సేకరణకు ఇప్పటికే అనుమతి ఇచ్చింది. కానీ భవిష్యత్ అవసరాలు, ఆరు లైన్లు కాకుండా 8 లైన్లకు విస్తరించడం, ఓఆర్ఆర్ వెంట రైల్వే లైన్ నిర్మాణం కోసం 150 మీటర్లు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. అయితే జాతీయ రహదారుల కోసం సేకరించే భూమిని దానికే వినియోగించాలని రైల్వే లైన్ కోసం తాము భూములు సేకరించమని జాతీయ రహదారుల శాఖ స్పష్టం చేసింది. ఒకవేళ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ వెంట రైల్వే లైన్ నిర్మించ తలపెడితే రైల్వే శాఖను సంప్రదించాలని సూచించింది. 

ఒకవేళ రైల్వే శాఖ ఓఆర్ఆర్ వెంట రైల్వే లైన్ నిర్మాణానికి అనుమతిస్తే అమరావతి అభివృద్ధికి ఇదే కీలకం కావచ్చు. ఎందుకంటే అమరావతి చుట్టూ 189 కిలోమీటర్ల మేర ఓఆర్ఆర్, రైల్వే లైన్ రెండూ పక్కపక్కనే ఉంటే రవాణా ఎంత సులభమౌతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాంతాల అభివృద్ధికి కీలకం అవుతుంది.

Also read: Amaravati ORR: దేశంలోనే అతి పెద్ద ఓఆర్ఆర్, 121 గ్రామాల మీదుగా 189 కిలోమీటర్లు, ఓఆర్ఆర్ వెళ్లే గ్రామాలివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News