Babu Delhi Tour: ఆంధ్ర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన దేశ రాజధానిలో పర్యటించనున్నారు. ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాత్రికి ఢిల్లీ నుంచి బయలుదేరి నేరుగా విశాఖపట్నం చేరుకుంటారు.
రేపు ఉదయం తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అది ముగిసిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాలకు విశాఖ నుంచి నేరుగా మళ్లీ ఢిల్లీ వెళ్తారు. అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఆ రోజు రాత్రి అక్కడే బసచేస్తారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
7వ తేదీన అమరావతికి రానున్నారు చంద్రబాబు. అదే రోజు చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ ప్రారంభం అవుతుంది. రాష్ట్ర మంత్రివర్గం భేటీ ముందు సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఏపీలో కూటమి బలపరిచిన టీచర్ ఎమ్మెల్సీలో దెబ్బ తినడంతో పాటు.. మిగిలిన రెండు స్థానాలను గెలుచుకున్నారు. మరోవైపు త్వరలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలను ఎవరికీ కేటాయించాలనే దానిపై కేంద్ర పెద్దలకు వివరించనున్నారు. మరోవైపు ఖాళీ అయిన రాజ్యసభ స్థానం విషయంలో అది బీజేపీ ఇవ్వాలా.. టీడీపీ తీసుకోవాలనే అంశంపై కేంద్ర పెద్దలతో చర్చించున్నారు. మరోవైపు ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తోన్న పనులను వివరించనున్నారు. అంతేకాదు రాష్ట్రంలో అమలు కానున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల కోసం కేంద్ర నిధులు విడుదల చేయాలనే అంశంపై కూడా చర్చకు రానున్నట్టు సమాచారం.
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









