)
Andhra Pradesh:ఈ ఏడాది మామిడి సీజన్లో తోతాపురి రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడ్డారు. దీంతో తోతాపురి మామిడి రైతులు కొంత కాలంగా ఈ పెండింగ్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఈ డబ్బులు జమ కావడంతో వారంతా ఆనందంలో ఉన్నారు. తోతాపురి మామిడి ధర పడిపోవడంతో రైతులను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకుంది. కిలో మామిడికి రూ.4 అదనంగా ఇచ్చేలా రూ.260 కోట్లు కేటాయించి రైతులకు న్యాయం చేసింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్రం 50 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం భరించేలా నిబంధనలు సడలించాలని కేంద్రాన్ని కోరారు. తోతాపురి మామిడికి కూడా ఈ స్కీమ్ వర్తించేలా నిబంధనలు సడలించడంతో, కేంద్రం రూ.130 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భవిష్యత్తులో తోతాపురి మామిడి ధర పడిపోయినప్పుడు ఈ స్కీమ్ ద్వారా రైతులకు అండగా నిలవడానికి అవకాశం ఏర్పడింది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని మామిడి రైతులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. ఈ ఏడాది మామిడి ధరలు పడిపోయినప్పుడు, ప్రైవేటు కొనుగోలు ధరతో పాటు కిలోకు అదనంగా చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు రైతు వివరాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీంతో డబ్బులు జమ మొదలయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 31,929 మంది మామిడి రైతులున్నారు.
*
2025–26 సీజన్‌కు గాను మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ధరల లోపం చెల్లింపు ను కేంద్రం ఆమోదించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 1.62 లక్షల మెట్రిక్ టన్నుల మామిడిని కొనుగోలు చేసే అవకాశం రైతులకు లభించింది. క్వింటాల్ మామిడికి రూ.1,490.73 చొప్పున మద్దతు ధర ఫైనల్ చేశారు. ఈ మొత్తంలో 50 శాతం కేంద్ర ప్రభుత్వం, మిగిలిన 50 శాతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.