AP Government: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక అమలు చేయాల్సిన సూపర్ సిక్స్ హామీలపై విమర్శలు వస్తున్నాయి. పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ తప్ప మిగిలినవి ఇంకా అమలు కాలేదు. ఈలోగా మత్స్యకారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఊహించని నజరానా ప్రకటించారు.
ప్రతి ఏటా నిర్ణీత కాల వ్యవధిలో చేపల వేటపై నిషేధం ఉంటుంది. తల్లి చేపలు, రొయ్యల సంరక్షణ కోసం ఇది చాలా కీలకం. దేశవ్యాప్తంగా ఇది అమలవుతుంటుంది. అంటే ఈ రెండు నెలలు మత్స్యకారులు పూర్తిగా ఉపాధి కోల్పోతారు. ఈ సమయంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారుల కుటుంబాలకు ఆర్ధికంగా చేయూత అందిస్తుంటాయి. ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మత్స్యకారులకు ఊహించని గిఫ్ట్ అందించేందుకు సిద్ధమయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కొక్క మత్స్యకార కుటుబానికి ఏకంగా 20 వేల రూపాయలు అందించేందుకు నిర్ణయించారు. గతంలో ఇది కేవలం 10 వేల రూపాయలు ఉండేది. కానీ మత్స్యకారుల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ప్రభుత్వం ఈ ఆర్ధిక సహాయాన్ని రెట్టింపు చేసింది.
రాష్ట్ర సమాచార, పౌర సరఫరాల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడి ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. మత్స్యకార కుటుంబాలకు చేపల వేట నిషేధ సమయంలో ఇప్పటి వరకూ ఇచ్చే 10 వేల ఆర్ధిక సహాయాన్ని రెట్టింపు చేసి 20 వేలు వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. మత్స్యకారుల జీవితాల్లో భద్రతకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఈ నెల అంటే ఏప్రిల్ 26వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఓ గ్రామాన్ని సందర్శించి లబ్దిదారులకు ఆర్ధిక సహాయం అందిస్తారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా బ్యాంక్ ఎక్కౌంట్లలో నేరుగా డబ్బులు జమ కానున్నాయి.
ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకూ మొత్తం 61 రోజులు చేపల వేటపై నిషేధం ఉంటుంది. ఈ సమయంలో చాలామంది మత్స్యకారులకు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురౌతాయి. ఉపాధి లేక డబ్బులకు ఇబ్బంది పడుతుంటారు. ఓ విధంగా చెప్పాలంటే ఈ రెండు నెలల కాలం అత్యంత కష్టంగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో ఆర్ధికంగా చేయూత అందించేందుకు కూటమి ప్రభుత్వం 20 వేల రూపాయలు మత్స్యకారుల బ్యాంక్ ఎక్కౌంట్లలో జమ చేయనుంది.
Also read: AP Ration Card e KYC: మీ రేషన్ కార్డు ఇ కేవైసీ ప్రక్రియ పూర్తయిందా, ఇలా చెక్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









