
Chandrababu: రాష్ట్ర విభజన అనంతరం ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుపై చాలాకాలంగా సందిగ్ధత ఏర్పడింది. విజయవాడలోనా లేక విశాఖపట్నంలోనా అనే విషయంలో సందిగ్ధత ఏర్పడింది. ఎట్టకేలకు విజయవాడలోనే ఏర్పాటు చేసి చంద్రబాబు అనుకున్నది సాధించారు.
ఏపీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం విజయవాడలో ఏర్పాటైంది. మహాత్మాగాంధీ రోడ్డులోని స్టాలిన్ సెంట్రల్ భవనంలో ఈ కార్యాలయాన్ని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి రబిశంకర్ ప్రారంభించారు. ఇక నుంచి ఇంటిగ్రేటెడ్ బ్యాంకింగ్, ఫారిన్ ఎక్స్చేంజ్ వంటి పలు విభాగాలు ఇక్కడే పనిచేస్తాయి. ఆర్బీఐ కార్యాలయంలోని పలు ఛాంబర్లకు గోదావరి, తుంగభద్ర వంటి నదుల పేర్లు పెట్టారు. ఆడిట్ బడ్జెట్ అండ్ కంట్రోల్ సెల్, సెంట్రలైజ్డ్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ అండ్ డెవలప్మెట్ డిపార్ట్మెంట్ , ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి విభాగాలు ఉంటాయి. అన్ని విభాగాలకు కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పించారు.
వాస్తవానికి రాష్ట్ర విభజన తరువాత అటే 11 ఏళ్ల నుంచి ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై సందిగ్ధత నెలకొంది. గతంలో అంటే 2014-19 కాలంలో విజయవాడ లేదా అమరావతిలో ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం ప్రయత్నించినా కొన్ని కారణాలతో ఆలస్యమైంది. ఆ తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం మారడంతో చంద్రబాబు నేరుగా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఆర్బీఐతో సంప్రదించారు. విజయవాడలోనే ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పించారు. ఎట్టకేలకు ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభమైంది.
రెండంతస్థుల ఈ భవనంలో ఓ ఛాంబర్ గోదావరి, మరో ఛాంబర్‌కు తుంగభద్ర పేరు పెట్టారు. 11 ఏళ్ల సందిగ్ధతకు తెరపడింది. ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ అట్టా ఒమర్ బషీర్ నేతృత్వంలో కార్యకలాపాలు నడుస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook