
Babu New House: వెలగపూడి సచివాలయం వెనుక రహదారి పక్కనే చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు. తన ఇంటి నిర్మాణం ద్వారా రాజధాని అమరావతికి ఒక భరోసా, నమ్మకంగా ఉండాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అందులోభాగంగా ఇటీవల అమరావతిలో ఐదు ఎకరాల స్థలాన్ని సీఎం చంద్రబాబు సొంతంగా కొనుగోలు చేశారు.
మరోవైపు భూమి పూజ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి పట్టు వస్త్రాలు సమర్పించాలని గ్రామస్తులు నిర్ణయించారు. 2వేల 500 గజాల్లో రాజధాని ఇంటి నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు చేపట్టనున్నారు.
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..
కార్యాలయం, నివాసంలోపాటు కారు పార్కింగ్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని సీఎం చంద్రబాబు ఈ ఇంటి నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ నిర్మాణ స్థలాన్ని ఇటీవల నారా భువనేశ్వరి సైతం పరిశీలించారు.ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్ లో సొంత ఇల్లు ఉన్నా.. రాజధాని ప్రాంతంలో సీఎం అధికారిక నివాసంలో ఉంటున్నారు. ఇకపై అలా కాకుండా.. సొంతంగా ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకునేలా చంద్రబాబు నాయుడు అక్కడ సొంత ఇంటి నిర్మాణానికి పూనుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe