)
Andhra pradesh Chief Minister Chandrababu Naidu : ఏపీ రాష్ట్రంలో ఆంధ్రా ప్రెన్యూర్స్’ అనే పేరును నిలబెట్టాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఉండవల్లి నివాసంలో ఆంట్రప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్‌కు చెందిన పలువురు యువ పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలున్నాయి.
అగ్రి ప్రాసెసింగ్, పర్యాటకం, డిఫెన్స్, స్పేస్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్ ఇలా వేర్వేరు రంగాల్లో ఉన్న అవకాశాల్ని వినియోగించుకోవాలని పిలుపు నిచ్చారు. విశాఖ- చెన్నై మధ్య నాలుగు లేన్ల రైల్వేలైన్ ప్రాజెక్టుతో ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారతాయన్నారు. భవిష్యత్తులో అమరావతి- హైదరాబాద్- బెంగళూరు- చెన్నై దేశంలోనే అతిపెద్ద కారిడార్‌గా మారుతుందన్నారు.
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. ఆయా పరిశ్రమలకు తగ్గట్టు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆయా దేశాల పేర్లను సూచించేలా పార్కులతో సుందరీకరణ చేపడుతున్నామన్నారు చంద్రబాబు. సమావేశంలో విశాఖ ఎంపీ భరత్ తదితర పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.