Chandrababu: ఏపీ అసంబ్లీలో స్వర్ణాంద్ర విజన్ 2047పై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్రంగా మాట్లాడారు. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ భారతదేశ జీడీపీ లక్ష్యాన్ని సాధించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రజల సమగ్ర అభివృద్దిని దృష్టిలో ఉంచుకుని తగిన కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా గత ఎన్నికల్లో ఓటమికి సంచలన కారణాలు వివరించారు.
స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్‌పై చర్చలో మాట్లాడిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర తలసరి ఆదాయాన్ని 55 లక్షలకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించామన్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ 2.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 17.11 శాతం వృద్ధి రేటుు సాధించదలిచామన్నారు. దీనికోసం కొత్త పెట్టుబడిదారులు, పారిశ్రామిక వృద్ధి కోసం కీలక విధానాలు అమలు చేస్తున్నామన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా అభివృద్ధి, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.
మరో వైపు రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా హిందీ భాషకు సంబంధించి జరుగుతున్న వివాదం, ఇదే అంశంపై ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నేపధ్యంలో చంద్రబాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు. భాష విషయంలో జరుగుతున్న రగడపై మాట్లాడారు. భాషపై లేనిపోని రాజకీయాలు చేయొద్దని సూచించారు. భాష అనేది ద్వేషించేందుకు కాదని, బతుకుదెరువుకై ఎన్ని భాషలైనా నేర్చుకుంటామన్నారు. అయితే మాతృభాషను మాత్రం మర్చిపోకూడదన్నారు.
ఇక గత ఎన్నికల్లో ఓటమిపై కూడా చంద్రబాబు స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. 2004, 2019 ఎన్నికల్లో తనను ఎవరూ ఓడించలేదని, ఈ ఎన్నికల్లో ఓటమికి తానే కారణమని చెప్పుకున్నారు. కొన్ని పనులు చేయకపోవడం వల్లనే ఓడిపోయినట్టు చంద్రబాబు అంగీకరించారు. పనిలో పడి పార్టీని, ఎమ్మెల్యేలను సమన్వయం చేయలేకపోయానన్నారు. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపగలిగితే ఇక ఓటమి ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు.
Also read: APPSC Exams Hall Tickets: ఏపీపీఎస్సీ పరీక్షల హాల్ టికెట్లు వచ్చేశాయి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









