YS Sharmila: వైయస్ షర్మిలకు జాక్ పాట్.. ఏకంగా రాజ్యసభకు నామినేట్..!

YS Sharmila:APCC అధ్యక్షురాలు YS షర్మిలకు కాంగ్రెస్‌ హై కమాండ్‌ బంపర్‌ ఆఫర్‌ ఇవ్వనుందని తెలుస్తోంది. త్వరలో ఆమెను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపనుందని సమాచారం.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 19, 2025, 09:33 AM IST
YS Sharmila: వైయస్ షర్మిలకు జాక్ పాట్.. ఏకంగా రాజ్యసభకు నామినేట్..!

YS Sharmila: త్వరలో కర్ణాటక  నుంచి  నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. వాటిలో ఒకటి YS షర్మిలకు దాదాపు ఖరారు అయ్యిందని తెలుస్తోంది. AP లో పార్టీ బలో పేతమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ అడుగులు వేస్తోంది. మరో వైపు అధికార బీజేపీని రాజ్యసభలో సమర్థవంతంగా ఎదుర్కొవాలంటే MPYS షర్మిల ను అస్త్రంగా వినియోగించాలని AICC భావిస్తున్నట్టు సమాచారం.

Add Zee News as a Preferred Source

ఇక వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా చేసిన పార్టీ పరిస్థితిలో ఎలాంటి మార్పులు రాలేదనే చెప్పాలి. ఏదో కొంత మంది నాయకులు ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. పైగా అన్న వైయస్ జగన్ ను టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేస్తోంది వైయస్ షర్మిల. అన్న తనకు పార్టీలో ఎలాంటి కీలక పదవులు ఇవ్వకపోవడంతో అలిగిన షర్మిల అన్న జగన్ ను రాజకీయంగా సమాధి చేయాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంది.

ఇక వైయస్ షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఒరిగిందేమి లేదు కానీ.. కానీ షర్మిలకు మాత్రం కాంగ్రెస్ పార్టీ వల్ల రాజకీయంగా పదవులు దక్కుతున్నాయనేది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఆమెకు రాజ్యసభ ఇవ్వడం వలన బీజేపీని ఏ విధంగా ఎదుర్కొంటుందనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. పైగా ఇపుడు రాజ్యసభలో ఉన్న వారు బీజేపీని ధీటుగా ఎదుర్కొవడంలో విఫలం అయ్యారా అనే ముచ్చట వినిపిస్తోంది. మరి కాంగ్రెస్ అధిష్ఠానం ఆమెకు రాజ్యసభ సీటు ఇవ్వడం వెనక జగన్ వైపు ఉన్న ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకోవాలనే ఆలోచన తప్పితే మరొకటి లేదు. మరో పది పదిహేనేళ్ల వరకు కాంగ్రెస్ పార్టీ ఏపీలో నిలదొక్కుకోవడం కష్టమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..

ఇదీ చదవండి:  ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News