AP Liquor Sales: ఏపీలో మందుబాబులకు ఫుల్ కిక్, గల్లాపెట్టెలో కాసుల గలగల

AP Liquor Sales: ఆంధ్రప్రదేశ్‌లో అటు ప్రభుత్వానికి ఇటు మందుబాబులకు మూడు ఫుల్స్ ఆరు కేసుల్లా ఉంది పరిస్థితి. కిక్ మందుబాబులకు ఇస్తే ఆదాయం ప్రభుత్వానికి లభిస్తోంది. కొన్ని బ్రాండ్ల రీ ఎంట్రీతో అమ్మకాలు భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 4, 2025, 12:15 PM IST
AP Liquor Sales: ఏపీలో మందుబాబులకు ఫుల్ కిక్, గల్లాపెట్టెలో కాసుల గలగల

AP Liquor Sales: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక మందుబాబులకు పండుగ వాతావరణం నెలకొంది. అటు బ్రాండెడ్ మద్యంతో పాటు 99 రూపాయలకు క్వార్టర్ మందు లభిస్తుండటంతో అంతా మత్తులో ఊగుతున్నారు. అటు వ్యాపారులకు ఇటు ప్రభుత్వానికి కాసులు రాలుతున్నాయి. 

Add Zee News as a Preferred Source

ఏపీలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన ఏడాదిలో 30 వేల కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. బ్రాండెడ్ మద్యం అందుబాటులో రావడంతో పాటు 99 రూపాయలకే క్వార్టర్ మద్యం లభిస్తుండటంతో అమ్మకాలు భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. రోజుకు దాదాపుగా 83 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2023-24తో పోలిస్తే 2024-25 ఆర్ధిక సంవత్సరంలో 9.1 శాతం అమ్మకాలు పెరగగా విలువ మాత్రం 0.34 శాతం పెరిగింది. 99 రూపాయలకే క్వార్టర్ మద్యం, కొత్త బ్రాండ్లు అందుబాటులో రావడం, కొన్ని బ్రాండ్ల ధరలు తగ్గించుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే మద్యం అమ్మకాలు రాష్ట్రమంతా పెరగకపోవడం గమనార్హం. 12 జిల్లాల్లో మద్యం అమ్మకాలు తగ్గాయి. 

2023-24లో 30 వేల కోట్ల అమ్మకాలు నమోదైనప్పుడు ఆదాయం 25,082 కోట్లు వచ్చింది. గత ఏడాది అమ్మకాల విలువ స్వల్పంగా పెరిగి 30,183 కోట్లకు చేరింది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక దరఖాస్తు రుసుముల రూపంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి 180 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది మొత్తం మద్యం అమ్మకాల్లో 99 రూపాయలకే క్వార్టర్ మద్యం అమ్మకాల వాటా 30 శాతం ఉంది. 

తాజాగా జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మద్యం అమ్మకాలను మరింతగా పెంచనున్నాయి. 3 స్టార్, ఆ పై హోదా హోటల్స్‌కు బార్ లైసెన్స్ ఫీజు 25 లక్షలకు కుదించింది ప్రభుత్వం. మరో వైపు రాష్ట్రంలో 44 బార్లకు ఇ వేలం నిర్వహించనుంది. 

2023-24తో పోలిస్తే లిక్కర్ కేసులు 25.02 లక్షలు, బీర్ కేసులు 16.47 లక్షలు పెరిగాయి. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 13.63 శాతం, చిత్తూరులో 1.71 శాతం, శ్రీ సత్యసాయి జిల్లాలో 10.22 శాతం అమ్మకాలు పెరిగాయి. ఇక శ్రీకాకుళంలో .39 శాతం, అనకాపల్లిలో 1.77 శాతం, పార్వతీపురం మన్యం జిల్లాలో 1.34 శాతం, నెల్లూరులో 1.32 శాతం అమ్మకాలు తగ్గాయి. 

Also read: AP Bars e Auction: మందుబాబులకు గుడ్‌న్యూస్, 44 బార్లకు ఈ వేలం, ఏ జిల్లాలో ఎంత ఫీజు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News