)
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారనున్నట్టు ఏపీ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రానున్న 48 గంటల్లో తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది ఆంధ్ర ప్రదేశ్ తీరం వైపు దూసుకువస్తోందని వాతావరణవాఖ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణశాఖ భారీ హెచ్చరిక జారీ చేసింది.
ఈ పరిస్థితుల ప్రభావంతో నేడు ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. అటు తమిళనాడు, కేరళలో పలు ప్రాంతాలతో పాటు తెలంగాణలో కూడా వర్షాలు పడే అవకాశాలున్నాయిని తెలిపింది. ఈ రోజుతో పాటు మరో రెండు రోజులు పాటు మత్స్య కారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ తెలిపింది.
అల్ప పీడనం ప్రభావంతో ప్రభుత్వం ఇప్పటికే ముందుస్తు చర్యలు చేపట్టింది. 48 యేళ్ల క్రితం నవంబర్ నెలలోనే దివిసీమ తుపానుతో ఏపీ అతలాకుతలం అయింది. దాన్ని నుంచి తేరుకోవడానిక ప్రజలకు కొన్నేళ్ళ సమయం పట్టింది. మళ్లీ నవంబర్ లోనే తుపానుగా మారడంతో ప్రజలు బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. మొంథా తుపాను మాదిరి ఇది కూడా బలహీన పడితే పెద్ద ప్రమాదం తప్పుతుంది. ప్రస్తుతానికి అయితే.. ఈ తుపానుతో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మరోవైపు ఈదురు గాలులు అంతగా లేకపోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. తీర ప్రాంత ప్రజలు అంతగా భయపడాల్సిన అవసరం లేదని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుంది. కొన్ని చోట్ల సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.