Pawan Kalyan: ఉత్తరాంధ్ర ఏజెన్సీ జిల్లాలో రెండు రోజులు పాటు పవన్ కళ్యాణ్ పర్యటన..

Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి  జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్ ఏపీలోని ఉత్తరాంధ్రలోని రెండు ఏజెన్సీ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 7, 2025, 10:14 AM IST
Pawan Kalyan: ఉత్తరాంధ్ర ఏజెన్సీ జిల్లాలో రెండు రోజులు పాటు పవన్ కళ్యాణ్ పర్యటన..

AP Deputy Chief Minister Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఈ రోజు, రేపు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో పర్యటించనున్నారు.  హైదరాబాద్‌ నుంచి విమానంలో బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో అరకులోయ నియోజకవర్గం డుంబ్రిగుడ మండలం చాపరాయికి  చేరుకుంటారు. దీనికి అవతల వైపున సుమారు 3కిలోమీటర్ల దూరంలో ఉన్న పెదపాడు గ్రామాన్ని సందర్శించి, రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి, అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు.

Add Zee News as a Preferred Source

అక్కడినుంచి డుంబ్రిగుడకు చేరుకుంటారు. అల్లూరి జిల్లాకు మంజూరు చేసిన సుమారు 200 రోడ్ల నిర్మాణాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. తర్వాత అరకులోయ వెళ్లి ఏపీటీడీసీ హరిత రిసార్ట్స్‌లో రాత్రి బసచేస్తారు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు అరకులోయ మండలం సుంకరమెట్ట సమీపంలోని కాఫీ తోటలకు చేరుకుని, అటవీ శాఖ చెక్కలతో నిర్మించిన కాలిబాట వంతెనను ప్రారంభిస్తారు.

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

అనంతరం రోడ్డు మార్గంలో పవన్‌ విశాఖపట్నం ఇందిరాగాంధీ జూలాజికల్‌ పార్కుకు చేరుకొని ఎకో టూరిజంపై అధికారులతో సమీక్షిస్తారు. మొత్తంగా ఎన్నికల సమయంలో రోడ్లు వేయిస్తానని హామి ఇచ్చిన పవన్ కళ్యాణ్ అందుకు తగ్గట్టు పనులను చకచకా చేసుకుంటూ వెళుతున్నారు. పవన్  కళ్యాణ్ ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాలు చేస్తున్నారు. ఈయన హీరోగా నటించిన ‘హరి హర వీరమల్లు’ సినిమాతో పాటు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు లైన్ లో ఉన్నాయి.

ఇదీ చదవండి:  Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..

ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News