Chameleon vs Pawan Kalyan: ఊసరవల్లి కంటే వేగంగా పవన్ కళ్యాణ్, ట్రెండ్ అవుతోన్న ఆ పదం

Chameleon vs Pawan Kalyan: జయకేతనం పేరుతో జనసేన ఆవిర్భావ సభ ఎన్నో ప్రశ్నలకు కేంద్ర బింద్రువైంది. పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలు హాట్ టాపిక్‌గా మారాయి. హిందీ అంశంపై పవన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఊసరవల్లి పదం ట్రెండ్ అవుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 15, 2025, 03:48 PM IST
Chameleon vs Pawan Kalyan: ఊసరవల్లి కంటే వేగంగా పవన్ కళ్యాణ్, ట్రెండ్ అవుతోన్న ఆ పదం

Chameleon vs Pawan Kalyan: పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభ జయకేతనంలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంలో రెండు కీలకాంశాలున్నాయి. ఒకటి తెలంగాణలో పార్టీ వ్యాప్తితో పాటు కూటమి నిలబెట్టే ప్రయత్నం కాగా రెండవది హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఒకప్పుడు ఉత్తరాదిపై పోరాటం చేస్తానన్న పవన్ కళ్యాణ్..ఇప్పుడు ఉత్తరాది కోసం పోరాటం చేస్తానంటున్నాడంటూ విమర్శలు వస్తున్నాయి. 

Add Zee News as a Preferred Source

పిఠాపురం పార్టీ సభలో రాష్ట్ర, జాతీయ అంశాలపై తన వైఖరిని పవన్ కళ్యాణ్ సుస్పష్టం చేశారు. తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు అంతగా దుమారం రేపకపోయినా హిందీ భాష గురించి చేసిన వ్యాఖ్యలు మాత్రం వివాదాస్పదంగా మారుతున్నాయి. హిందీని భాషను వెనకేసుకురావడం, డీఎంకే ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టడం చర్చనీయాంశంగా మారింది. హిందీ భాష నేర్చుకోవల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. హిందీ సినిమాల డబ్బింగ్‌తో వ్యాపారం చేసుకోవచ్చు గానీ హిందీ మాట్లాడకూడదంటారా అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హిందీ వ్యతిరకిస్తున్నవాళ్లు కూడా తమ సినిమాలు హిందీలో డబ్ చేసుకుంటున్నారని విమర్శించారు. దేశంలో భాషాపరమైన వైవిద్యం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్ని భాషలు నేర్చుకుంటే అంతగా మెరుగుపడతామన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయదల్చిన త్రిభాషా సూత్రాన్ని అనుసరించక తప్పదన్నారు. 

ఈ వ్యాఖ్యలే ఇప్పుడు వివాదం రేపుతున్నాయి. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ హిందీ గో బ్యాక్ అంటూ చేసిన నినాదాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బయటికొస్తున్నాయి.  కొత్తగా Chameleon పదాన్ని ట్యాగ్ చేస్తూ వైరల్ చేసే ప్రయత్నం జరుగుతోంది. Chameleon అంటే ఊసరవల్లి. పవన్ కళ్యాణ్ ఊసరవల్లి కంటే వేగంగా రంగులు మారుస్తున్నారంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని గతంలో పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ఊగిపోతూ చేసిన ప్రసంగాలు గుర్తు చేస్తున్నారు. గతంలో ఓసారి తెలుగేతర సీనియర్ ఐఏఎస్ అధికారిని టీటీడీ ఈవోగా నియమించినప్పుడు తప్పుబట్టిన విధానం ప్రస్తావిస్తున్నారు. ఉత్తరాది అహంకారం, దక్షిణాది అంటే చిన్నచూపు అంటూ ఆవేశంగా చేసిన ప్రసంగం క్లిప్పింగ్ జత చేసి వైరల్ చేస్తున్నారు.

ఇప్పుడు అదే ఉత్తరాదిని వేరు చేసి ఎలా మాట్లాడతారంటూ పవన్ కళ్యాణ్ చెబుతుండటం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఊసరవల్లి కంటే వేగంగా రంగులు  మార్చుతున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. అందుకే ఊసరవల్లి పదాన్ని ట్రెండ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఉత్తరాదిపై తన పోరాటం అని చెప్పి ఇప్పుడు ఉత్తరాది నాయకుల కోసం పోరాటం చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 

Also read: Pawan Kalyan: పవన్ నోట జై తెలంగాణ నినాదాలు, ఏపీ హిట్ ఫార్ములా అమలు చేయనున్నారా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News