Pawan Kalyan Convoy: పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా జేఈఈ మెయిన్స్ మిస్ అయిన 30 మంది విద్యార్ధులు

Pawan Kalyan Convoy: ఆంధ్రప్రదేశ్‌లో జేఈఈ విద్యార్ధులకు తీరని నష్టం జరిగింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కారణంగా పరీక్ష రాయలేకపోయారు. విద్యార్ధులు , తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 7, 2025, 03:48 PM IST
Pawan Kalyan Convoy: పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా జేఈఈ మెయిన్స్ మిస్ అయిన 30 మంది విద్యార్ధులు

Pawan Kalyan Convoy: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారణంగా జేఈఈ విద్యార్ధులకు పరీక్ష దూరమైంది. ఎంత ప్రాధేయపడినా అనుమతించకపోవడంతో లబోదిబోమంటున్నారు. పవన్ కళ్యాణ్ నేరుగా కలగజేసుకుని న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. అసలేం జరిగిందంటే..

Add Zee News as a Preferred Source

ప్రస్తుతం దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ సెషన్ 2 పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు ఉదయం, మద్యాహ్నం రెండు షిఫ్టుల్లో జరుగుతాయి. ఉదయం షిఫ్ట్ పరీక్ష 9.30 నుంచి 12.30 వరకు ఉంటుంది. అయితే గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. అంటే 8.30 గంటలు దాటితే పరీక్ష కేంద్రం లోపలకు అనుమతించరు. విశాఖపట్నంలో జరిగిన పరీక్షకు కొంతమంది విద్యార్ధులు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన కారణంగా హాజరుకాలేకపోయారు. పెందుర్తి అయాన్ డిజిటల్ సెంటర్‌కు చెందిన విద్యార్ధులుు పరీక్ష రాసేందుకు వెళ్తుండగా పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వస్తుందని పోలీసులు మధ్యలో నిలిపివేశారు. దాంతో విద్యార్ధులు పరీక్ష కేంద్రానికి ఆలస్యమయ్యారు. పెందుర్తిలోని జేఈఈ మెయిన్స్ పరీక్ష కేంద్రానికి 8.30గంటలకు కాకుండా 8.32 గంటలకు చేరుకున్నారు. మార్గమధ్యలో పోలీసులు ట్రాఫిక్ నిలిపివేయడం వల్ల సమయానికి చేరుకోలేపోయామని విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. 

ఇలా మొత్తం 30 మంది విద్యార్ధులకు జేఈఈ మెయిన్స్ సెషన్ 2 పరీక్ష దూరమైంది. పవన్ కళ్యాణ్ వచ్చే మార్గంలోనే పరీక్ష కేంద్రం ఉంది. ప్రోటోకాల్ పేరుతో పోలీసులు ట్రాఫిక్ ఆపివేశారు. ఎంత ప్రాధేయపడినా నిర్వాహకులు లోపలకు అనుమతించలేదు. దాంతో 30 మంది విద్యార్ధులు పరీక్షకు దూరమైపోయారు. ఈ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలగజేసుకుని పరీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

Also read: Summer Vacation Places: ఈ వేసవిలో ఎక్కడికెళ్లాలని ఆలోచిస్తున్నారా, హైదరాబాద్ నుంచి బయలుదేరే టూరిజం ప్యాకేజీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News