Anna Lezhneva: అన్నా లెజినోవా తలనీలాలు ఇవ్వకూడదా, వైరల్ అవుతున్న వీడియోలు

Anna Lezhneva: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సనాతనవాదిగా ప్రకటించుకున్న పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తలనీలాలు సమర్పించడం కొత్త వివాదానికి దారితీస్తోంది. మొక్కుబడి చెల్లింపులో భాగంగానే ఇచ్చినా ఇది తగని పనంటున్నారు ఆధ్యాత్మిక వేత్తలు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 15, 2025, 09:53 AM IST
Anna Lezhneva: అన్నా లెజినోవా తలనీలాలు ఇవ్వకూడదా, వైరల్ అవుతున్న వీడియోలు

Anna Lezhneva: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడినందుకు పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమల స్వామికి తలనీలాలు సమర్పించుకుంది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వివాదం రేపుతోంది. 

Add Zee News as a Preferred Source

పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవా ఓ క్రిస్టియన్. కుమారుడు మార్క్ శంకర్ ప్రాణాలతో బయటపడటంతో తిరుమల స్వామివారిని సందర్శించుకుని డిక్లరేషన్ ఇచ్చింది. ఆ తరువాత మొక్కుబడి చెల్లింపు కోసం తల నీలాలు సమర్పించింది. క్రిస్టియన్ అయి ఉండి తిరుమల స్వామిపై భక్తితో తల నీలాలు సమర్పించడంపై జన సైనికులు, పవన్ అభిమానులు నిజమైన తల్లి ప్రేమ, దేవునిపై భక్తి అంటూ కీర్తిస్తున్నారు. కానీ నిజమైన సనాతనంలో ఇది తగదంటున్నారు మరి కొందరు ఆధ్యాత్మిక వేత్తలు. 

తనను తాను నిజమైన సనాతనవాదిగా ప్రకటించుకున్న పవన్ కళ్యాణ్‌కు సనాతనం గురించి తెలియదా అని విమర్శలు చేస్తున్నారు. సనాతనంలో మహిళలు పుణ్యక్షేత్రాల వద్ద తల నీలాలు సమర్పిచడం సరైంది కాదంటున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. సనాతనం తెలిసిన హిందూ మహిళలు మూడు కత్తెరలు మాత్రమే ఇవ్వాలని విస్పష్టంగా చెబుతున్నారు. ముఖ్యంగా ముత్తయిదువులైన మహిళలు అస్సలు ఆ పని చేయకూడదంటున్నారు. గుండు చేయించుకోవడం అశుభమంటున్నారు. ముక్కులు చెల్లించడం, ఇచ్చేసుకోవడం పరిపాటిగా మారిందని..దీనిని ఓవర్ యాక్షన్ అంటారంటున్నారు. పూర్వం ఎవరూ అలా చేయలేదని చెబుతున్నారు. భర్త ఉన్న స్త్రీ ఎప్పుడూ అలా చేయకూడదంటున్నారు. దీనికి లాజిక్ కావాలంటే సాధ్యం కాదని, కొన్ని యోగశాలలో రుజువైతే మరి కొన్ని యాగశాలలో నిరూపితమౌతాయంటున్నారు.

చాలామంది గరికపాటి నరసింహరావు చేసిన  ఈ వ్యాఖ్యల వీడియో పోస్ట్ చేస్తుంటే మరి కొందరు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త అనంతలక్ష్మి మాటల వీడియో పోస్ట్ చేస్తున్నారు. మహిళలు తల నీలాలు సమర్పించడంలో తప్పు లేదంటున్నారు అనంతలక్ష్మి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ రెండు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Also read: Amaravati Capital Works: అమరావతిలో మళ్లీ భూ సమీకరణ, మరో 44 వేల ఎకరాలు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News