Andhra Pradesh: ఏపీలో మెడికల్ దుకాణాల తనిఖీల్లో ఉద్రిక్తత..

Andhra Pradesh:ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని మెడికల్ దుకాణాల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్, ఈగల్ టీమ్ అధి కారుల తనిఖీలలో ఉద్రిక్తత ఏర్పడింది. అధికారులను దుకాణదారులు అడ్డుకున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 26, 2025, 11:45 AM IST
Andhra Pradesh: ఏపీలో మెడికల్ దుకాణాల తనిఖీల్లో ఉద్రిక్తత..

Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాలో  పట్టణంలోని రెండు దుకాణాల్లో ఔషధ నియంత్రణ అధికారులు తనిఖీలు చేశారు. స్థానిక ప్రధాన రోడ్డులోని ఓ దుకాణంలో తనిఖీలు చేస్తుండగా.. పట్టణ టీడీపీ అధ్యక్షుడు, వాణిజ్య మండలి అధ్యక్షుడు యేచూరి రామకృష్ణ, మరికొంత మంది వ్యాపారులు అక్కడికి చేరుకుని ఎందుకు తనిఖీలు చేస్తున్నారని అధికారిని ప్రశ్నించారు. తమకు ఫిర్యాదులు రావడంతో వచ్చినట్లు డ్రగ్ ఇన్స్పెక్టర్ సురేష్ తెలిపారు. మామూళ్లు కోసమే తనిఖీలు చేస్తున్నారని ఆరోపించగా ఆయన ఖండించారు. మందులు అక్రమంగా క్రయ, విక్రయాలు చేస్తున్నారని మందులు విక్రయిస్తున్నట్లు అధికారి ఆరోపించారు.

Add Zee News as a Preferred Source

స్థానిక ఎమ్మెల్యే సౌమ్య ఫోన్ చేస్తే బయట ఉన్నానని చెప్పి,  ఇక్కడ తనిఖీలు చేస్తున్నారని వ్యాపారులు అంటున్నారు. డ్రగ్ ఇన్స్ పెక్టర్ ఎమ్మెల్యే దగ్గరకు రావాలని రామకృష్ణ పట్టుబట్టారు. లేకపోతే ఎమ్మెల్యేనే వస్తారన్నారు. దీనిపై అధికారి మాట్లాడుతూ తాము తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఇవి ఆపేసి రావడం కుదరదని తర్వాత వచ్చి ఎమ్మెల్యేను కలుస్తామని చెప్పారు. సమాచారం అందుకున్న సీఐ, వారికి సర్ది చెప్పి వ్యాపారులు, ఇతరులను దుకాణం నుంచి బయటకు పంపించారు.

ఈ నేపథ్యంలో పట్టణం లోని మందుల దుకాణాలను వ్యాపారులు మూసి వేశారు. రాత్రి వరకు దుకాణాలు తెరవకపోవడంతో మందుల కోసం వచ్చినవారు ఇబ్బందిపడ్డారు. అనంతరం స్థానిక క్లాత్ మర్చంట్స్ అసోసి యేషన్ హాలులో మెడికల్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. విజయవాడ సంఘ అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ.. అధికారుల దాడుల విషయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.వెంటనే దుకాణాలు తెరచి ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు.

ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..

ఇదీ చదవండి:  ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News