AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్ 2025 దరఖాస్తు చేసేందుకు రేపు ఏప్రిల్ 24 ఆఖరు తేదీ. మే 12 నుంచి హాల్ టికెట్లు కూడా జారీ కానున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చ్ 12న విడుదల కాగా 15వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 24 గడువు తేదీగా ఉంది.
ఏపీలో ఈఏపీసెట్ 2025 కు అప్లై చేసేందుకు రేపు ఏప్రిల్ 24 వరకే సమయం ఉంది. ఏప్రిల్ 24 తరువాత మే 1 వరకూ 1000 రూపాయల జరిమానాతో అప్లై చేసుకోవచ్చు. మే 7 వరకు 2 వేల రూపాయల జరిమానాతో దరఖాస్తు చేయవచ్చు. మే 6 నుంచి మే 8 మధ్యలో దరఖాస్తుల కరెక్షన్‌కు అవకాశం ఉంటుంది. మే 12 వరకూ అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది కానీ జరిమానా 4 వేలు కట్టాల్సి ఉంటుంది. అదే మే 16 వరకు అయితే 10 వేల జరిమానాతో అప్లై చేసుకోవచ్చు.
మే 19 నుంచి 27 వరకూ ఈఏపీసెట్ పరీక్షలు ఉంటాయి. మే 12 నుంచి హాల్ టికెట్లు జారీ అవుతాయి. ఈసారి ఈఏపీసెట్ 2025 పరీక్షలను జేఎన్టీయూకే నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు 3.41 లక్షల మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఈఏపీసెట్ పరీక్షకు రాష్ట్రంలో 46 కేంద్రాలుంటే హైదరాబాద్‌లో మరో రెండు కేంద్రాలున్నాయి. ఈఏపీసెట్ పరీక్షలు జనరల్ కేటగరీ విద్యార్ధులకు 900 రూపాయలు ఫీజు కాగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు 500 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఈఏపీసెట్ 2025 ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కళాశాలల్లో అడ్మిషన్లు ఉంటాయి.
Also read: Fastag System: మే 1 నుంచి ఫాస్టాగ్ పనిచేయదా, మరి ప్రయాణం చేయాలంటే ఎలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









