AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్ 2025 ఎలా అప్లై చేయాలి, పరీక్ష తేదీ, ఫీజు, ఇతర ముఖ్యమైన తేదీలు ఇవే

AP EAPCET 2025: విద్యార్ధులకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ ఈఏపీసెట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నడుస్తోంది. ఇప్పటి వరకు ఇంకా అప్లై చేసుకోకుంటే ఇంకా అవకాశముంది. AP EAPCET 2025కు సంబంధించి ముఖ్యమైన తేదీలు ఇవే

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 26, 2025, 11:07 AM IST
AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్ 2025 ఎలా అప్లై చేయాలి, పరీక్ష తేదీ, ఫీజు, ఇతర ముఖ్యమైన తేదీలు ఇవే

AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్ అనేది రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కళాశాలల్లో వివిధ కోర్సుల్లో చేరేందుకు తప్పనిసరిగా రాయాల్సిన ప్రవేశ పరీక్ష ఈసారి ఈ పరీక్షను  జేఎన్టీయూ కాకినాడ నిర్వహిస్తోంది. ప్రస్తుతం అప్లికేషన్ల గడువు తేదీ ఇంకా మిగిలి ఉంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు cets.apsche.ap.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. 

Add Zee News as a Preferred Source

ఏపీలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మార్చ్ 15న మొదలైన ఈ ప్రక్రియ ఏప్రిల్ 24 వరకు కొనసాగనుంది. జరిమానాలతో అయితే మే 12 వరకు సమయం ఉంది. ఒకసారి అప్లికేషన్ ఆన్‌లైన్‌లో దాఖలు చేసిన తరువాత ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కరెక్షన్లు చేసుకోవచ్చు. ఈ పరీక్ష రెండు దశల్లో ఉంటుంది. అగ్రికల్చర్, ఫార్మాకు ఒకసారి, ఇంజనీరింగ్ విభాగానికి మరోసారి ఉంటుంది. ఈ పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇలా ఉన్నాయి. 

మార్చ్ 15 నుంచి ఏప్రిల్ 24 వరకూ అప్లికేషన్లు దాఖలు చేయవచ్చు. అప్లికేషన్ ఆన్‌లైన్‌లో cets.apsche.ap.gov.in ద్వారా అప్లై చేసుకోవాలి. 1000 రూపాయల జరిమానాతో మే 1 వరకూ గడువు ఉంది. అదే 2 వేల రూపాయల జరిమానాతో అయితే మే 7 వరకు అప్లై చేసుకోవచ్చు. 4 వేల జరిమానాతో మే 12 వరకూ సమయం ఉంది. ఇదే చివరి అవకాశం. మద్యలో మే 6-8 వరకు అప్లికేషన్లో ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోవచ్చు. ఏపీ ఈఏపీసెట్ 2025 హాల్ టికెట్లు మే 12న అందుబాటులో ఉంటాయి. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా జనరల్ కేటగరీ విద్యార్ధులకు 600 ఫీజు ఉంటుంది. అదే ఓబీసీ విద్యార్ధులకు 550 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులయితే 500 రూపాయలు ఫీజు ఉంటుంది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ రెండు పరీక్షలు రాస్తుంటే ఫీజు 1200 చెల్లించాల్సి ఉంటుంది. ఏపీ ఈఏపీసెట్ పరీక్ష మే 19 నుంచి 27 మధ్యలో జరుగుతుంది. 

ఇంటర్ పైనల్ ఇయర్ ఎంపీసీ రాసిన విద్యార్ధులకు ఏపీ ఈఏపీసెట్ 2025 ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు రాసేందుకు అర్హులు. అదే అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికయితే బయోలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరిగా కలిగి ఉండాలి. 

Also read: 8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్రేట్‌న్యూస్, లెవెల్ 9,10 కేటగరీ ఉద్యోగులకు పెరిగే జీతం ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News