AP ECET 2025: ఏపీ ఈసెట్ నోటిఫికేషన్ వచ్చేసింది, పరీక్ష తేదీ అప్లికేషన్ గడువు ఇదే

AP ECET 2025: ఆంధ్రప్రదేశ్ ఈసెట్ 2025 నోటిఫికేషన్ వెలువడింది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ఈసెట్ పరీక్షలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 10, 2025, 05:39 PM IST
AP ECET 2025: ఏపీ ఈసెట్ నోటిఫికేషన్ వచ్చేసింది, పరీక్ష తేదీ అప్లికేషన్ గడువు ఇదే

AP ECET 2025: AP ECET 2025 నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఎంట్రన్స్ పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్ధులు మార్చ్ 12 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఏప్రిల్ 7 చివరి తేదీ. 

Add Zee News as a Preferred Source

ఏపీలోని ఇంజనీరింగ్, బీ ఫార్మసీ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈసెట్. ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్ టెస్ట్ ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ మేథ్స్ చేసిన అభ్యర్ధులకు నేరుగా బీఈ, బీటెక్, బీ ఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశం కల్పిస్తారు. దీనినే లేటరల్ ఎంట్రీ విధానం అంటారు. ఈసారి ఏపీఈసెట్ పరీక్షను అనంతపురం జేఎన్టీయూ నిర్వహిస్తోంది. మార్చ్ 12 నుచి ఏప్రిల్ 7 వరకూ ఆన్‌లైన్ విధానంలో అప్లికేషన్లు స్వీకరిస్తారు. మే 6వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్ష రెండు షిఫ్టుల్లో ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మద్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. అభ్యర్ధుల అర్హతలు, వయో పరిమితి ఇతర వివరాలు నోటిఫికేషన్‌లో ఉన్నాయి. 

ఏపీఈసెట్ ర్యాంక్ ఆధారంగా పోలిటెక్నిక్ డిప్లొమా కోర్సు లేదా బీఎస్సీ మేథ్స్ చేసిన విద్యార్ధులకు నేరుగా బీటెక్, బీఈ, బీ ఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం కల్పిస్తారు. వీటిలో కూడా అగ్రికల్చర్ ఇంజనీరింగ్, సివిల్, కంప్యూటర్ సైన్స్, కెమికల్, బయో టెక్నాలజీ, సెరామిక్ టెక్నాలజీ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాలు ఉంటాయి. అటు తెలంగాణలో కూడా ఈసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఉస్మానియో యూనివర్శిటీ ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. ఏప్రిల్ 19 వరకు ఎలాంటి పెనాల్టీ లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. 

Also read: 7th Pay Commission DA Hike: ఉద్యోగులకు బిగ్ షాక్, ఈసారి 2 శాతమే పెరగనున్న డీఏ

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News