)
Andhra pradesh Fact check clarity on Srimavishnu idol near alipiri: తిరుమలను భక్తులు కలియుగ వైకుంఠంగా భావిస్తారు. శ్రీవారిని భక్తులు కొంగు బంగారంగా భావిస్తారు. నిత్యం కోట్లాది మంది స్వామి వారి దర్శనాలకు వస్తారు. తిరుమలలో రాజకీయాలు, కాంట్రవర్సీ పనులు చేస్తే కఠిన చర్యలుఉంటాయని టీటీీడీ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే.. ఈ క్రమంలో ప్రస్తుతం అలిపిరి వద్ద ఉన్న విగ్రహం విషయం ఏపీలో పెద్ద దుమారంగా మారింది.
దీనిపై భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ... అలిపిరి వద్ద తాగుబోతుల మద్యం సీసాలు, పాడు ప్రదేశంలో దగ్గరగా శ్రీవారి మహావిష్ణువును పడేశారని ఇది కూటమి పాలనకు నిదర్శనమని, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై మండిపడ్డారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే అలిపిరి నడకమార్గం వద్ద శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని టీటీడీ యాజమాన్యం నిర్లక్ష్యంగా పడేసిందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. ఆ విగ్రహాన్ని చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని, హైందవ ధర్మం పట్ల, హిందూ దేవతల విగ్రహాల పట్ల ప్రస్తుత టీటీడీ యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో దీన్ని బట్టి తెలిసిపోతుందని విమర్శించారు. ఈ ఘటనకు పూర్తి నైతిక బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్, పాలకమండలి సభ్యులు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించాలని కోరారు.
ఈ క్రమంలో దీనిపై తాజాగా.. ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ విభాగం క్లారిటీ ఇచ్చింది. ఇది శ్రీ మహావిష్ణువు విగ్రహాం కాదని, అసంపూర్ణంగా చెక్కిన శనీశ్వరుడి విగ్రహం అని స్పష్టం చేసింది. గతంలో తయారీలోపం కారణంగా గతంలో ఇక్కడ శిల్పాలు చెక్కిన కన్నయ్య ఇక్కడే పెట్టేసి వెళ్లిపోయారని చెప్పింది. గత పదేళ్లుగా ఈ విగ్రహం ఇక్కడే ఉందని కూడా అధికారులు స్పష్టం చేశారు.
కేవలం రాజకీయ దురుద్దేషంతోనే భూమన కరుణాకర్ రెడ్డి ఈ విధంగా హిందు సంఘాల్ని, భక్తులను రెచ్చగొట్టే విధంగా ఫెక్ ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ విభాగం ఒక క్లారిటీ ఇచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook