Andhra Pradesh Budget 2025-26: ఆరు గ్యారంటీలకు కూటమి సర్కారు పెద్ద పీట.. ఏపీలో పూర్తిస్థాయి బడ్జెట్ కేటాయింపుల హైలెట్స్ ఇవే..

Ap govt Budget session: ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు సర్కారు తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. దాదాపు 3 లక్షల 24 వేల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌ ప్రవేశపెడుతోంది. సూపర్ సిక్స్ సహా.. మెనిఫెస్టోలోని అన్ని పథకాల అమలుకై కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 28, 2025, 11:26 AM IST
  • ఏపీలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టిన కూటమి సర్కారు..
  • ఆరుగ్యారంటీలకు ప్రాధాన్యత..
Andhra Pradesh Budget 2025-26: ఆరు గ్యారంటీలకు కూటమి సర్కారు పెద్ద పీట..  ఏపీలో పూర్తిస్థాయి బడ్జెట్ కేటాయింపుల హైలెట్స్ ఇవే..

Ap Govt budget 2025-26: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో తొలిసారి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ క్రమంలో ఈ బడ్జెట్ ఏపీలో రాజకీయాల పరంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ ఉదయం 10 గంటలకు ఏపీ ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఏపీ బడ్జెట్ లో ముఖ్యంగా ఏపీలో ఆరుగ్యారంటీలపై కూటమి సర్కారు పెద్ద పీట వేసింది.

Add Zee News as a Preferred Source

అంతేకాకుండా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హమీని నెరవేర్చే విధంగా చంద్రబాబు సర్కారు బడ్జెట్ పై  భారీగా కసరత్తులు చేసింది.  మరోవైపు కొల్లు రవీంద్ర శాసనమండలిలో బడ్జెట్‌ ప్రవేశపెడతారు. 

అదే విధంగా.. అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు.. శాసనమండలిలో మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. ఈ సారి ఏపీలో ..  రూ.3.24 లక్షల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. 

ఆరు గ్యారంటీలకు ప్రయారిటీ..

2025-26 ఆర్థిక సంవత్సర బడ్దెట్టులో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే విధంగా.. సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు 2025-26 బడ్జెట్లో పెద్ద పీట వేశారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ. 20 వేలు ఇచ్చేలా కేటాయింపులు చేశారు. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లల్లో చదివే విద్యార్థులకు తల్లికి వందనం వర్తింపచేస్తున్నారు. 1-12వ తరగతుల విద్యార్థులకు తల్లికి వందనం స్కీం వర్తింపుచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

హెల్త్ కు బడ్జెట్ లో పెద్దపీట..

విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులను జమ చేయనున్న ప్రభుత్వం. స్కూళ్లు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు చేశారు. ఎటువంటి జాప్యం అర్హులైన వారందరికి.. కార్పోరేట్ వైద్యం అందేలా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలుపై బడ్జెట్టులో ప్రస్తావించారు. ఈ ఏడాదిలోనే రూ. 25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకం అమలుచేయనున్నట్లు సర్కారు  వెల్లడించింది. ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నట్టు బడ్జెట్టులో వెల్లడించారు.

ఉచిత విద్యుత్ పై కీలక అప్ డేట్ ..

ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, చేనేతలకూ ఉచిత విద్యుత్ అమలు, చేనేత మగ్గాలపై ఆధారపడే వారికి 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్,  మరమగ్గాలపై ఆధారపడే వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నారు. నాయీ బ్రహ్మణుల సెలూన్లకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఇంటి నిర్మాణాలు..

వృద్ధుల సంరక్షణ కోసం 12 వృద్ధాశ్రామాలు ఏర్పాటుకై ప్రత్యేకంగా కేటాయింపులు చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 7 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేశారు. టిడ్కో ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్టులో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇళ్ల నిర్మాణం నిమిత్తం ఎస్సీలకు అదనంగా రూ. 50 వేలు, ఎస్టీలకు అదనంగా రూ. 75 వేలు ఇవ్వనున్నట్టు బడ్జెట్టులో వెల్లడించారు. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే సాయాన్ని రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు పెంచిన ప్రభుత్వం. దీపం 2.0 కింద నిధుల కేటాయింపులు చేశారు. ఆదరణ పథకం పునః ప్రారంభించిన కూటమి ప్రభుత్వం.

Read more: Tirumala: తిరుమలలో మార్చి 14న ప్రత్యేక వేడుక.. ఈ భక్తులు రావొద్దని చెప్పిన టీటీడీ

ఇళ్ల నిర్మాణం నిమిత్తం ఎస్సీలకు అదనంగా రూ. 50 వేలు, ఎస్టీలకు అదనంగా రూ. 75 వేలు ఇవ్వనున్నట్టు బడ్జెట్టులో వెల్లడించారు. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే సాయాన్ని రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు పెంచినట్లు కూటమి ప్రభుత్వం వెల్లడించింది. దీపం 2.0 కింద నిధుల కేటాయింపు. ఆదరణ పథకం పునః ప్రారంభించిన కూటమి ప్రభుత్వం బడ్జెట్ లో వెల్లడించింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News