
Ys Jagan: హిందూ ఆధ్యాత్మికతకు కేరాఫ్‌గా చెప్పుకునే ఆంధ్రప్రదేశ్‌లో అడుగడుగునా భంగం వాటిల్లుతోంది. ఆలయాలు కూల్చివేతలు, హిందూ ధర్మంపై దాడులు కొనసాగుతున్నాయి. సనాతనం అంటూ తిరిగే కొందరికి ఇవేమీ కన్పించడం లేదు. ఏపీలో దెబ్బతింటున్న ఆధ్యాత్మిక శోభపై వైఎస్ జగన్ అగ్రహం వ్యక్తం చేశారు. హైందవ ధర్మం పరిరక్షణ ఎవరి హయాంలో జరిగిందని ప్రశ్నిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న ఆలయాల కూల్చివేతలు, హిందూ ధర్మంపై దాడులపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. ఎక్స్ సాక్షిగా పలు ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. తనకు వచ్చిన కొన్ని ఆర్జీలు, అందిన సమాచారం ఆధారంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని విశ్లేషించారు. సనాతనం అంటూ చెప్పుకుంటే సరిపోదని దేవుడంటే భక్తి లేదని వైఎస్ జగన్ ఆక్షేపించారు. ఎవరి హయాంలో రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసిందని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత కాశీ నాయన క్షేత్రంలో జరిగిన కూల్చివేతలు, ఇతర దాడులకు ప్రత్యక్ష సాక్షులు కావాలా అని అడిగారు. ఇదే కాశీనాయన క్షేత్రంపై గతంలో ఏం జరిగిందో వివరించారు.
అటవీ ప్రాంతంలో ఉన్న కాశీ నాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, తొలగింపుపై 2023 ఆగస్టు 7 న కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఆదేశాలిస్తే తాము మాత్రం ఆ క్షేత్రాన్ని పరిరక్షించామని గుర్తు చేశారు. అదే నెలలో అంటే ఆగస్టు 18వ తేదీన కాశీ నాయన క్షేత్రం విస్తరించిన 12.98 హెక్టార్ల భూమిని అటవీశాఖ నుంచి మినహాయించి, క్షేత్రానికి కేటాయించాలని కోరుతూ కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు స్వయంగా తాను లేఖ రాశానన్నారు. అందుకు పరిహారం చెల్లించాల్సి వచ్చినా లేక ఆంక్షలు విధిస్తే పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం ఆ చర్యల్ని నిలిపివేసింది. ఐదేళ్ల తమ పాలనలో ఆ క్షేత్రానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు. ఆలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాల పట్ల తమకున్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
కానీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన ఆరు నెలలకే ఆక్కడేం జరిగిందో అంతా చూశారన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంపై బుల్డోజర్లు నడిపి కూల్చివేయడాన్ని రాష్ట్ర ప్రజలు చూశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు, అటవీశాఖ మంత్రి , డిప్యూటీ సీఎం పర్యవేక్షణలో కాశీనాయన క్షేత్రం కూల్చివేసిందానికి ఆధారాలు కావాలా అని ప్రశ్నించారు. తామే కూల్చివేత ఉత్తర్వులు ఇచ్చి ఇప్పుడు ఏం ఎరుగనట్టు మాటల చెప్పడంపై మండిపడ్డారు. తిరుమల లడ్డూ విషయంలో దుష్ప్రచారంతో ఆలయ ప్రతిష్ఠ దిగజార్చింది ఎవరని ప్రశ్నించారు. టీటీడీ చరిత్రలో ఎన్నడూలేని విధంగా తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడాన్ని వైఎస్ జగన్ గుర్తు చేశారు.
తన శాఖ పరిధిలో జరిగిన కూల్చివేతపై సనాతన మంత్రి స్పందించకపోవడం విడ్డూరమన్నారు. ఇలాంటి వ్యక్తులకు హిందూ ధర్మంపై, ఆలయాల పరిరక్షణపై మాట్లాడే హక్కు ఉందా అని నిలదీశారు వైఎస్ జగన్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి