AP Government: కారు చౌక బేరం, 99 పైసలకే 21 ఎకరాలు ధారాదత్తం కేవలం బడాబాబులకు మాత్రమే

AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఎకరానికి కేవలం 99 పైసలకే భూమి కట్టబెడుతోంది. అలాగని మీరు కూడా ఎగబడకండి. ఇది కేవలం బడాబాబులకు మాత్రమే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 16, 2025, 05:06 PM IST
AP Government: కారు చౌక బేరం, 99 పైసలకే 21 ఎకరాలు ధారాదత్తం కేవలం బడాబాబులకు మాత్రమే

AP Government: సెంటు భూమి కొనాలంటే సామాన్యుడు నానా కష్టాలు పడకతప్పదు. అటు మధ్య తరగతి ప్రజలకు కూడా భూమి కొనుగోలు అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే పరిస్థితి. కానీ బడాబాబులకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అత్యంత చౌకగా అంటే కటిక పేదవాడు సైతం అవలీలగా చెల్లించే రూటుతో బడా పారిశ్రామిక వేత్తలు భూములు దక్కించుకోవచ్చు. అవును ఇది నిజం. ఏపీ ప్రభుత్వం అదే పని చేసింది. 

Add Zee News as a Preferred Source

ఎకరం భూమి కోట్ల రూపాయలు పలుకుతుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం కేవలం 99 పైసలకే ఆ బడా పారిశ్రామిక సంస్ఖకు లీజుకిచ్చేసింది. టాటా సంస్ఖకు చెందిన టీసీఎస్ కంపెనీకు విశాఖపట్నంలో ఎకరం భూమి 99 పైసల చొప్పున 21.6 ఎకరాలను ధారాదత్తం చేసింది. 150 ఏళ్ల క్రితం కూడా ఆ ప్రాంతంలో అంతకంటే ఎక్కువ రేటే ఉండి ఉండవచ్చు. అంత తక్కువ ధరకు కంపెనీలకు భూముల్ని ధారాదత్తం చేస్తున్న ప్రభుత్వాలకు అటు తీసుకునే కంపెనీలకు సిగ్గు ఉండటం లేదు. కనీసం మార్కెట్ ధరకు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉండటం లేదు. సదరు సంస్థకు అంతకంటే ఉండదు. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నప్పుడు కూడా టాటా మోటార్స్ సంస్థకు 99 పైసలకే భూమిని కేటాయించారట. 

టాటా సంస్ఖకు చెందిన టీసీఎస్‌కు ఇంత కారుచౌకు భూమి కేటాయిస్తే విశాఖక తరలి వద్దామనుకునే ఇతర కంపెనీలు కూడా అదే అడుగుతాయి. అందరికీ ఇలానే 99 పైసలకు భూములు ధారాదత్తం చేస్తూ పోతుందా ప్రభుత్వం. 1370 కోట్లతో టీసీఎస్ ఓ అభివృద్ధి కేంద్రాన్ని నిర్మించదలచింది. ఈ కంపెనీ ద్వారా 12 వేల ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే 12 వేల ఉద్యోగాలు ఏపీకు చెందినవారికే రావు కదా. అందులో సగానికి పైగా ఇతర రాష్ట్రాలకు చెందినవాళ్లే కచ్చితంగా ఉంటారు. 

గతంలో అమరావతి ప్రాంతంలో ఎస్ఆర్ఎం కళాశాలకు 100 ఎకరాలు అప్పజెప్పింది ప్రభుత్వం. ఈ కళాశాలలో సీట్లంటే అంతా కమర్షియల్. ఒక్క సీటు కూడా ఉచితంగా పేదవారికి లేదా మెరిట్ విద్యార్ధులకు లభించదు. అలాంటప్పుడు వంద ఎకరాల భూమి ఇవ్వడం ఎంతవరకు సమంజసం. అసలు సాఫ్ట్‌వేర్ కంపెనీలకు 21 ఎకరాల భూమి ఎందుకు. చైనా, అమెరికాలో నిర్మించుకున్నట్టు వెర్టికల్ టవర్లు తక్కువ స్థలంలో నిర్మించుకోవచ్చు కదా అంటే సమాధానం లేదు. దానికి పెట్టుబడి భారీగా కావల్సి ఉంటుంది. అంత పెట్టుబడి పెట్టేందుకు ఆ కంపెనీలు ముందుకు రావు. అమెరికాలో ఫ్రీడం టవర్స్, చైనాలో ట్రేడ్ సెంటర్లు ఇలా వెర్టికల్ నిర్మాణాలే. 

అనంతపురంలో కియా కంపెనీకు భూములు ఇచ్చాక ఆ కంపెనీ ఎంతమంది స్థానికులకు ఉద్యోగాలిచ్చిందో ఎవరూ చెప్పలేరు. బడాబాబులు, బడా సంస్థలు అడిగితే చాలు కంపెనీ పేరుతో కోట్ల విలువ చేసే వేలాది ఎకరాల భూములు కట్టబెట్టేస్తున్నారు. 

Also read: Public Holiday: ఏప్రిల్ 18 బ్యాంకులు, స్కూల్స్, ఆఫీసులకు సెలవు ఎందుకంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News