SC Classification Bill: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం, ఏ కేటగరీలో ఎన్ని ఉప కులాలంటే

SC Classification Bill: ఎస్సీ వర్గీకరణ బిల్లుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. ఇటు అసెంబ్లీలో అటు శాసన మండలిలో బిల్లుకు ఆమోదం లభించింది. మాజీ ఐఏఎస్ అధికారి రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమీషన్ నివేదికకు ఏపీ అసెంబ్లీ, శాసనమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 20, 2025, 04:44 PM IST
SC Classification Bill: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం, ఏ కేటగరీలో ఎన్ని ఉప కులాలంటే

SC Classification Bill: సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఎస్సీ వర్గీకరణ బిల్లుల్ని ఒక్కొక్క రాష్ట్రం అమలు చేసేందుకు సిద్ధమౌతున్నాయి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా సమర్పించిన నివేదికపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను చంద్రబాబు వివరించారు.

Add Zee News as a Preferred Source

ఎస్సీ వర్గీకరణ బిల్లును తొలుత ఏపీ అసెంబ్లీలో సమర్పించి చర్చించారు. జనాభా గణన పూర్తి కానందున ఎలాంటి సూచనలు చేయడం లేదని ఏకసభ్య కమీషన్ వివరించారు. 2026లో జరిగే జనాభా లెక్కల అనంతరం జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణకు సిఫార్సు చేసినట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అంశం ఎప్పటి నుంచో ఉందని గతంలోనే తాము ప్రతిపాదన చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన సంగతి గుర్తు చేశారు. జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిలిచామన్నారు. ఈ నివేదికను అందరి మద్దతుతో అసెంబ్లీ ఆమోదించింది. ఎస్సీ రిజర్వేషన్లను ఏ, బీ, సీ, డీలుగా విభజించేందుకు తాము 1996లోనే కమిటీ వేసిన సంగతి చంద్రబాబు గుర్తు చేశారు. 

అనంతరం హోంమంత్రి అనిత ఈ బిల్లును శాసనమండలిలో ప్రవేశపెట్టారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వ్యాఖ్యలు ఉదహరిస్తూ బిల్లును సభలో ఉంచారు. ఇందులో భాగంగా ఏ కేటగరీలో రెల్లి మరో 12 ఉప కులాలు ఉంటాయి. ఇక బి కేటగరీలో మాదిగతో పాటు 18 ఉప కులాలుంటాయి. సి కేటగరీలో మాలతో పాటు 25 ఉప కులాలు ఉంటాయి. డి కేటగరీలో ఆది ఆంధ్ర సహా ఉప కులాలు ఉంటాయి. ఓ కులం లేదా సమూహం తగినంత ప్రాధాన్యత పొందకపోవడానికి కారణం వెనుకబాటుతనమని మంత్రి అనిత తెలిపారు. కమీషన్ నివేదిక అధ్యయనం, ప్రభుత్వ సూచనలు, సిఫార్సుకు మంత్రుల నేతృత్వంలోని కమిటీ ముందు ఉంచారు. ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో మండలి కూడా ఆమోదించింది. 

ఎస్సీ వర్గీకరణ అంశంపై చంద్రబాబు కీలక విషయాలు వెల్లడించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా అసమానతలు మాత్రం తొలగలేదన్నారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పినట్టే మాట నిలబెట్టుకున్నామన్నారు. త్వరలో జనాభా గణన పూర్తయిన తరువాత జిల్లాల వారీగా విభజన చేస్తామన్నారు. అటు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ బిల్లుపై మాట్లాడారు. మందకృష్ణ మాదిగ, చంద్రబాబు వల్లనే ఎస్సీ వర్గీకరణ ఇంతదూరం వచ్చిందన్నారు. మాదిగల ఆత్మ గౌరవం నిలబెట్టిన ఘనత మందకృష్ణకే దక్కుతుందన్నారు. 

Also read: Betting Apps Case: మొన్న డ్రగ్స్..ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మాఫియాలో చిక్కుకున్న టాలీవుడ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News