Thalliki Vandanam: తల్లికి వందనంపై బిగ్ అప్‌డేట్, వాళ్లందరికీ ఈ పధకం దూరమేనా

Thalliki Vandanam: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనంపై బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఎప్పుడెప్పుడా అని విద్యార్ధులు ఎదురుచూస్తున్న ఈ పధకాన్ని ఎట్టకేలకు ప్రారంభించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 4, 2025, 09:42 PM IST
Thalliki Vandanam: తల్లికి వందనంపై బిగ్ అప్‌డేట్, వాళ్లందరికీ ఈ పధకం దూరమేనా

Thalliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వ హాయంలో ఇచ్చిన అమ్మ ఒడి పధకం నిలిచిపోయింది. ఇదే పధకాన్ని కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో అందరికీ అందిస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు ఈ పధకం ఎప్పుడు ప్రారంభించేది ప్రకటించడమే కాకుండా మరో కీలకమైన అప్‌డేట్ వెలువరించింది. 

Add Zee News as a Preferred Source

ఏపీలో తల్లులకు కూటమి ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. తల్లికి వందనం కోసం ఎదురుచూస్తున్న వేలాది మందికి నిరాశే ఎదురౌతోంది. మే నెల నుంచి తల్లికి వందనం పధకం ప్రారంభిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. దాంతో విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో 15 వేల రూపాయలు జమ కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ పధకానికి 69.16 లక్షల మందిని అర్హులుగా గుర్తించింది ప్రభుత్వం. అయితే గత ఎన్నికల హామీల్లో భాగంగా తల్లికి వందనం పధకాన్ని ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి 15 వేలు అందిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ హయాంలో ఇంటికి ఒకరికే ఈ సదుపాయం లభించేది. కానీ కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఈ పథకం లబ్ది అందిస్తామని తెలిపింది. 

ఈ ఏడాదిలో మే నెల నుంచి తల్లికి వందనం పథకం ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్ధులకు చదువుపై ఆసక్తి పెంచేందుకు ఈ ఆర్ధిక ప్రోత్సాహం ఉపయోగపడనుంది. అయితే తల్లికి వందనం పధకం విషయంలో కూటమి ప్రభుత్వం కొందరికి షాక్ ఇచ్చింది. ఈ పధకాన్ని రాష్ట్ర ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో ఒక్కొక్కరికి 15 వేలు జమ చేయనున్నామని ప్రకటించింది. అంటే ప్రైవేట్ స్కూల్స్‌లో చదివే విద్యార్ధులకు ఈ పధకం వర్తించదు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రైవేట్ స్కూల్ విద్యార్ధులకు కూడా తల్లికి వందన పథకం వర్తించింది. 

రాష్ట్రంలో మొత్తం 81 లక్షల మంది విద్యార్ధులు వివిధ తరగతుల్లో చదువుతున్నారు. వీరిలో 69.16 లక్షల మంది విద్యార్ధులు ఈ పధకాన్ని అర్హులుగా గుర్తించారు. దీనికోసం మొత్తం 10,300 కోట్లు ఖర్చు కానుంది. ఇంకా కొన్ని షరతులు ఉన్నాయి.  విద్యార్ధులకు 75 శాతం హాజరు కలిగి ఉండాలి. వైట్ రేషన్ కార్డు లేనివాళ్లు, ఇన్‌కంటాక్స్ చెల్లించే కుటుంబాలు, 300 యూనిట్లు దాటి విద్యుత్ వినియోగించేవాళ్లు, కారు ఉన్న కుటుంబాలు, నగర ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల్లో ఇళ్లు కలిగినవాళ్లను మినహాయించినట్టు తెలుస్తోంది. 

ఈ నిబంధనలపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. ఒకవేళ ఇవే నిజమైతే కచ్చితంగా వ్యతిరేకత రావచ్చు. ఎందుకంటే ఇవే నిబంధనలపై గతంలో ఇప్పటి పాలక పక్ష నేతలు తీవ్ర విమర్శలు చేశారు.

Also read: Snake Repellents: పాములు ఇళ్లలో చొరబడకుండా చేసే ఆకులు ఇవే

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News