Teachers Transfers Act: టీచర్లకు శుభవార్త, ఉపాధ్యాయ బదిలీలకు కొత్త చట్టం, బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

Teachers Transfers Act: ఆంధ్రప్రదేశ్ టీచర్లకు బిగ్ అప్‌డేట్. ఉపాధ్యాయ బదిలీల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. ఏపీ ఉపాధ్యాయ బదిలీ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఇవాళ ఆమోదించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 19, 2025, 07:58 PM IST
Teachers Transfers Act: టీచర్లకు శుభవార్త, ఉపాధ్యాయ బదిలీలకు కొత్త చట్టం, బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

Teachers Transfers Act: ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఉపాధ్యాయ బదిలీల క్రమబద్ధీకరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శాసనమండలి కూడా ఆమోదించాక చట్టరూపం దాల్చనుంది. అందరితో చర్చించిన తరువాతే ఈ చట్టం తీసుకొచ్చామని, ఇదొక చారిత్రాత్మక నిర్ణయమని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. 

Add Zee News as a Preferred Source

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకు సంబంధించిన రెండు బిల్లుల్ని ఇవాళ అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్ ప్రవేశపెట్టారు. ఏపీ ఉపాధ్యాయ బదిలీల క్రమబద్ధీకరణ బిల్లుతో పాటు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లును ప్రవేశపెట్టగా అసెంబ్లీ ఆమోదం లభించింది. ఈ బిల్లు ద్వారా ఇకపై రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని, సీనియార్టీ జాబితా ప్రకారం జరుగుతుందని మంత్రి లోకేశ్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయ బదిలీలు అక్రమంగా జరిగాయని తెలిపారు. ఆఖరికి ఎన్నికల సమయంలో కూడా 1100 మంది ఉపాధ్యాయుల్ని ఏకపక్షంగా బదిలీ చేశారన్నారు. కోర్టు జోక్యంతో ఈ బదిలీలు రద్దయ్యాయని తెలిపారు. 

గతంలో జరిగిన తప్పులు, పొరపాట్లు పునరావృతం కాకుండా పారదర్శకంగా బదిలీలు చేపట్టేందుకు కొత్త చట్టం తీసుకొచ్చామన్నారు. గతంలో బదిలీల్లో రాజకీయ కక్షలు, కోర్టుల జోక్యం జరిగిందన్నారు. టీచర్లు కేవలం బోధనపైనే దృష్టి సారించాలన్నారు. ఈ కొత్త చట్టం ద్వారా గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం, ఎక్కౌంటబిలిటీ పక్కాగా ఉంటాయన్నారు. ప్రైవేట్ రంగంలో యూనివర్శిటీలను ప్రోత్సహిస్తామని చెప్పారు. 

Also read: Heat Waves Alert: ఏపీకు వడగాలుల హెచ్చరిక, 58 మండలాల్లో తీవ్ర ప్రభావం వృద్ధులు చిన్నారులు జాగ్రత్త

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News