AP Government: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. కొత్తగా 2,260 టీచర్ పోస్టుల్ని సృష్టించింది. ఇవి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు. ఏపీ ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న మెగా డీఎస్సీ పోస్టులకు ఇవి అదనం.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేశారు. దాదాపు 16 వేల టీచర్ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వీటికి అదనంగా ఏపీ ప్రభుత్వం 2,260స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల్ని సృష్టించింది. ఇందులో 1136 ఎస్జీటీ పోస్టులు ఉంటే 1124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. వీటిని కూడా డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆటిజం మానసిక వైకల్యం కలిగినవారికి విద్య బోధించేందుకు ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు ఉంటారు.
జిల్లాలవారీగా ఈ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురంలో 101, చిత్తూరులో 17, తూర్పు గోదావరి జిల్లాలో 127, గుంటూరులో 151, కడప జిల్లాలో 57,కృష్ణాలో 71, కర్నూలులో 110, నెల్లూరులో 63, ప్రకాశం జిల్లాలో 74, శ్రీకాకుళంలో 71, విశాఖపట్నంలో 59, విజయనగరం జిల్లాలో 45, పశ్చిమ గోదావరి జిల్లాలో 90 పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టుల్ని డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌తో ఈ నోటిఫికేషన్ ఉంటుందా లేక విడిగా ఉంటుందా అనేది ఇంకా క్లారిటీ రావల్సి ఉంది. రెండూ కలిపి నోటిఫికేషన్ వస్తే మాత్రం 18 వేలకు పైగా పోస్టులు ఉంటాయి.
Also read: Uric Acid Problem: యూరిక్ యాసిడ్ సమస్యను ఈజీగా నిర్మూలించే బెస్ట్ ఫ్రూట్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









