AP Government: సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, బదిలీలకు గ్రీన్ సిగ్నల్

AP Government: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు త్వరలో ప్రక్రియ ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 10, 2025, 04:59 PM IST
AP Government: సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, బదిలీలకు గ్రీన్ సిగ్నల్

AP Government: ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకై మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షన్నర మంది సచివాలయ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. సచివాలయ ఉద్యోగులు చాలాకాలంగా కోరుతున్న డిమాండ్ ఇది. 

Add Zee News as a Preferred Source

ఏపీ ప్రభుత్వం దాదాపు లక్షన్నర మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రయోజనం కల్గించే నిర్ణయం త్వరలో తీసుకోనుంది. ఎప్పట్నించో కోరుతున్న విధంగా బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. వాస్తవానికి సచివాలయ ఉద్యోగులు బదిలీల కోసం చాలా రోజుల్నించి నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు ఈ విద్య సంవత్సరం ప్రారంభంలోనే బదిలీలు జరిగితే పిల్లల చదువు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. అందుకే త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించే అవకాశాలున్నాయి. హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్‌లో ఈ మేరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంటుంది. బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 16వరకు గడువు ఉండవచ్చు. 

ఆన్‌లైన్‌లో ఈ నెల 22 నుంచి ఉద్యోగుల బదిలీ ప్రక్రియ ప్రారంభం కానుంది. యూజర్ మాన్యువల్‌లో బదిలీలకు సంబంధించి విధి విధానాలు, మార్గదర్శకాలు ఉంటాయి. మ్యూచ్యువల్, స్పౌజ్, మెడికల్ గ్రౌండ్స్, దివ్యాంగులు, తల్లిదండ్రుల ఆనారోగ్యం, గిరిజన ప్రాంతాలు వంటి అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది.

Also read: Heavy Rains Alert: వచ్చే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

About the Author

Trending News