Free Gas Cylinder Scheme: గుడ్‌న్యూస్, ఇక రెండో ఫ్రీ గ్యాస్ సిలెండర్ బుక్ చేసుకోవచ్చు

Free Gas Cylinder Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. ఉచిత గ్యాస్ సిలెండర్ పథకానికి సంబంధించి కీలకమైన ప్రకటన వెలువడింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 2, 2025, 12:56 PM IST
Free Gas Cylinder Scheme: గుడ్‌న్యూస్, ఇక రెండో ఫ్రీ గ్యాస్ సిలెండర్ బుక్ చేసుకోవచ్చు

Free Gas Cylinder Scheme: ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటి ఉచిత గ్యాస్ సిలెండర్ పథకం. రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న ఈ పథకానికి సంబంధించి మరో గుడ్ న్యూస్ వెలువడింది. రెండవ ఉచిత సిలెండర్ కోసం అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. 

Add Zee News as a Preferred Source

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం దీపం -2 పథకం కింద ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత గ్యాస్ సిలెండర్లు అందిస్తోంది. ఇందులో భాగంగా ఏడాదిలో రెండు ఉచిత సిలెండర్లు అందించనున్నారు. గ్యాస్ సిలెండర్ ధర రోజురోజుకూ పెరిగిపోతున్న నేపధ్యంలో ఉచిత గ్యాస్ సిలెండర్లు చాలావరకు ఆర్ధికంగా ప్రయోజనం కల్గిస్తాయి. ఈ పథకం ద్వారా లక్షలాది కుటుంబాలకు మేలు జరగనుంది. ప్రస్తుతం 14 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ఒక్కొక్కటి 933 రూపాయలు ఉంది. దీపం 2లో భాగంగా ఏడాదికి రెండు ఉచిత సిలెండర్లు అంటే ఒక్కో కుటుంబానికి దాదాపుగా 1800 రూపాయలు ఆర్ధికంగా కలిసొస్తుంది. 

కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఇప్పటి వరకూ 90 లక్షల ఉచిత గ్యాస్ సిలెండర్లు అందించారు. ఇది తొలి విడత పంపిణీలో భాగంగా జరిగింది. త్వరలో ఈ పథకాన్ని మరింత మందికి ప్రయోజనం చేకూర్చేలా విస్తరించనున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రెండో విడత గ్యాస్ సిలెండర్ కోసం ఇప్పుడు ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది. అంటే ఉచిత గ్యాస్ సిలెండర్ పథకంలో ఏడాదిలో రెండవ సిలెండర్ కోసం లబ్దిదారులు ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకూ బుక్ చేసుకుని పొందవచ్చు. ఉచిత గ్యాస్ సిలెండర్ పథకంలో భాగంగా ముందు వినియోగదారులు పూర్తిగా చెల్లించి సిలెండర్ తీసుకోవాలి. ఆ తరువాత ఆ డబ్బుల్ని ప్రభుత్వం తిరిగి చెల్లించేస్తుంది. 

మరో వైపు ధాన్యం విక్రయించిన రైతులకు తక్షణం నగదు అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతులు ధాన్యం అమ్మిన 24 గంటల్లో బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు క్రెడిట్ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఇందులో భాగంగా రైతుల ఖాతాలకు ఇప్పటి వరకు 8200 కోట్లు జమ అయ్యాయి. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తమ ధాన్యాన్ని అమ్ముకునే ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. 

దీపం 2 పథకం కింద ఏడాదికి రెండు ఉచిత గ్యాస్ సిలెండర్లు, రైతులకు తక్షణ నగదు చెల్లింపు వంటి నిర్ణయాలతో సామాన్యులకు చాలా లబ్ది చేకూరుతోందని మంత్రి నాదెండ్ల తెలిపారు. సంక్షేమ పధకాల ద్వారా ప్రజలపై ఆర్ధిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 

Also read: Heavy Rainfall Alert: ఎండల నుంచి ఊరట, ఏపీ, తెలంగాణలో 5 రోజులు దంచికొట్టనున్న వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News