AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఇవాళ్టి నుంచి ఉద్యోగుల ఎక్కౌంట్లలో భారీగా డబ్బులు పడనున్నాయి. మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగి అయితే మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో లేదో సరి చూసుకోండి. రాష్ట్రంలోని ఉద్యోగుల బకాయిల నిమిత్తం మొత్తం 6200 కోట్ల విడుదలయ్యాయి.
ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన బకాయిల జమ ప్రక్రియ ప్రారంభమైంది. ఉద్యోగుల జీఎల్ఐ, జీపీఎఫ్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇవాళ ఉదయం 11.30 గంటల నుంచి ఉద్యోగుల ఎక్కౌంట్లలో డబ్బులు జమ అవడం ప్రారంభమైంది. దీనికోసం మొత్తం 6200 కోట్ల విడుదల చేసింది ప్రభుత్వం. మంగళవారం లేదా బుధవారం సాయంత్రానికి బకాయిలు మొత్తం విడుదల కానున్నాయి. ఇప్పటికే చాలా మంది ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. మార్చ్ 26 నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి కావచ్చు.
ఉద్యోగులకు రావాల్సిన సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఏఐ పరిధిలో మొత్తం 6200 కోట్లు విడుదలయ్యాయి. ఇటీవల జనవరి నెలలో కూడా 1033 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించింది. అటు ప్రభుత్వ ఉద్యోగులు ఇటు పెన్షనర్లకు పెండింగ్ బకాయిల చెల్లింపు జరుగుతుండటంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ బకాయిలన్నీ గత ప్రభుత్వ హయాంలోనివని అంచనా. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల బకాయిలు 25 వేల కోట్లకు చేరాయని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఈ బకాయిలను విడతల వారీగా చెల్లించే క్రమంలో జనవరిలో 1033 కోట్లు విడుదల చేయగా ఇప్పుడు 6200 కోట్లు విడుదల చేసింది.
Also read: MS Dhoni Lightning Stump: అంత వేగం ఎలా సాధ్యం, వైరల్ అవుతున్న ధోని స్టంపింగ్ వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









