AP Education System: రానున్న విద్యా సంవత్సరం నుంచి ఏపీలో స్కూల్ విద్యార్ధులకు కొత్త యూనిఫారాలు అందనున్నాయి. కొత్త యూనిఫాం, కొత్త స్కూల్ బ్యాగ్, కొత్త బెల్ట్ ఇలా మొత్తం కిట్ ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్ధులకు చదువుపై ఆసక్తి పెంచే కార్యక్రమాలు తీసుకురానుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వం అనుసరించిన స్కూల్ కిట్స్ విధానాన్ని కొనసాగించనుంది. గత వైసీపీ ప్రభుత్వం స్కూల్ విద్యార్ధులకు ప్రతి ఏటా తప్పనిసరిగా స్కూల్ కిట్ ఉచితంగా అందించేది. ఇందులో కొత్త యూనిఫామ్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, షూస్ ఉండేవి. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం స్కూల్ విద్యార్ధులకు స్కూల్ కిట్లను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉచితంగా అందించేందుకు సిద్ధమైంది. విద్య అవసరం, ప్రాముఖ్యతను పెంచడంతో పాటు విద్యార్ధుల్లో చదువుపై ఆసక్తి పెంచేందుకు ఈ తరహా కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త యూనిఫాం కూడా ప్రవేశపెడుతోంది. ఇందుకు సంబంధించిన శాంపిల్స్ ఇప్పటికే అసెంబ్లీలో అందరి ముందు ప్రదర్శించారు. పాత విద్యా విధానంలో ఉన్న లోపాల్ని అధిగమించి మరింత సమర్ధవంతమైన, పటిష్టమైన పద్ధతిని అమలు చేయనున్నారు.
ఇక అన్నింటికీ మించి విద్యార్ధులకు పుస్తకాల బరువు తప్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏపీ స్కూళ్లలో సెమిస్టర్ విధానం తీసుకురానున్నారు. అంటే విద్యార్ధులు ఒకేసారి ఎక్కువ పుస్తకాలు మోయాల్సిన అవసరం లేదు. ఒక సెమిస్టర్‌కు ఎన్ని పుస్తకాలు అవసరమో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. దీని ప్రకారం 1వ తరగతి విద్యార్ధులకు మొదటి సెమిస్టర్‌లో కేవలం 2 పుస్తకాలే ఉంటాయి. ఫలితంగా విద్యార్ధులకు అనవసరపు ఒత్తిడి తగ్గుతుంది. పుస్తకాల బరువు గణనీయంగా తగ్గుతుంది. ఏది ఏ మేరకు ఎంత అవసరమో అదే చదవగలుగుతారు.
పుస్తకాల బరువు నుంచి విద్యార్ధులకు రిలీఫ్ ఇచ్చే క్రమంలో మరో కార్యక్రమం ప్రారంభించనుంది. ప్రతి శనివారం నో బ్యాగ్ డే ఉంటుంది. ఆ రోజున విద్యార్ధులు స్కూల్ బ్యాగ్ తీసుకురావాల్సిన అవసరం లేదు. ప్రతి శనివారం పాఠ్య పుస్తకాల స్థానంలో ప్రాక్టికల్ శిక్షణ, ప్రాజెక్టు వర్క్, సామాజిక అంశాలపై అవగాహన ఇవ్వనుంది. విద్యార్ధులకు ఉత్తమ విద్య అందించాలంటే ఉపాధ్యాయులు కూడా అందుకు అనుగుణంగా సుశిక్షుతులవ్వాలి. దీనికోసం ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. అవసరమైతే విదేశాలకు పంపించి అక్కడి విధానాలు అధ్యయనం చేయిస్తారు. పాఠ్య పుస్తకాలపై రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
Also read: IT Notices: ఐటీఆర్ ఫైల్ చేయలేదా, నోటీసులొస్తున్నాయి జాగ్రత్త, ఐటీ రిటర్న్స్ ఎవరు ఫైల్ చేయాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









