)
AP Alert: ఏపీ ప్రజలకు కీలక గమనిక. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్లైన్ సేవలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. జూన్ 10 నుంచి రాత్రి వరకు అంటే మూడు రోజుల పాటు సేవలు ఆగిపోతున్నాయి. దాంతో వెంటనే సేవలు పొందాలంటే కష్టం కావచ్చు. ఏయే రకాల సేవలు నిలిచిపోనున్నాయో పరిశీలిద్దాం.
ఏపీలో ఆన్లైన్ సేవలు ఆగిపోనున్నాయి. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్లైన్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సేవా పోర్టల్‌ను మైక్రోసాఫ్ట్ క్లౌడ్ నుంచి ప్రభుత్వ డేటా సెంటర్‌కు బదిలీ చేస్తున్నందున రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో ముఖ్యమైన ఆన్లైన్ సేవలు ఆగిపోనున్నాయి. జూన్ 19 అర్ధరాత్రి వరకూ ఈ సేవలు ఆగుతాయి. ఈలోగా బదిలీ ప్రక్రియ పూర్తయితే జూన్ 11 నుంచి తిరిగి ప్రారంభం కావచ్చు.
తాత్కాలికంగా నిలిచే సేవలు ఇవే
ఇన్‌కం సర్టిఫికేట్, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్, ల్యాండ్ మ్యూటేషన్ పత్రాలు, ఇంటి స్థలాల దరఖాస్తులు, పట్టాలు, వృద్ధాప్య ధృవీకరణ పత్రం, వివాహ ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు సేవలు, జమా బందీ, పట్టాదారు పాస్‌బుక్ వంటి రెవిన్యూ శాఖ సేవలు, వాటర్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపులు, గ్రీవెన్సులు, లైసెన్సులు, అప్లికేషన్లు, మత్స్యశాఖ సేవలు ఆగిపోనున్నాయి. ఈ సేవలు పొందాలంటే జూన్ 11 వరకూ వేచి చూడాల్సిందే.
ఆన్లైన్ సేవల మార్పులు అన్ని ప్రభుత్వ సేవలపై ఉండకపోవచ్చు. ఆధార్ అప్డేట్, బ్యాంక్ సేవలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పధకాలు, నాన్ రెవిన్యూ సర్వీసెస్ కొనసాగనున్నాయి. అత్యవసర పనుల కోసం చూసేవాళ్లు జూన్ 11 వరకు ఆగాల్సిందే.
ఆన్లైన్ సేవల నిలిపివేతకు సంబంధించి పూర్తి సమాచారం కోసం https://ap.gov.in/ పోర్టల్ సందర్శించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook