Traffic Rules: ఆంధ్ర ప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అన్ని చోట్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి.అంతేకాదు వాహానాలను ఇష్టమొచ్చినట్టు నడిపి అమాకులకు ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు. ఇలా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే అతిగాళ్లకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం భారీ జరిమానాలతో చెక్ పెట్టేందుకు రెడీ అవుతోంది. ఇందు కోసం ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడే వారి కోసం ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద హై రెజల్యూషన్ కెమెరాలను ఉపయోగించనున్నారు.
ఈ నేపథ్యంలో APలో ట్రాఫిక్ సమస్యలు, తలెత్తే ప్రమాదాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ ఉల్లంఘనలపై భారీగా ఫైన్ విధించబోతుంది. మార్చి 1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త రూల్స ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడిన వాహనదారులకు రూ. 10 వేల జరిమానాతో పాటు లైసెన్స్ కూడా జీవిత కాలం రద్దు చేస్తున్నారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
దీంతో పాటు హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ. వెయ్యి.. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కార్లు నడిపితే రూ. 1000 జరిమానా వేయనున్నారు. ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్, రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేయడం వంటి కేసుల్లో రూ.వెయ్యి వరకు జరిమానా విధించనున్నట్లు కొత్త చట్టంలో పేర్కొన్నారు. ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారి పట్ల కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోనున్నారు. వారికి రూ.5 వేల జరిమానాతో పాటు సదరు వాహనాన్ని కూడా సీజ్ చేస్తామంటున్నారు ట్రాఫిక్ పోలీసులు .
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









