
AP Government: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి అప్పుడే 10 నెలలు అవుతోంది. సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలు ఏవీ అమలుకు నోచుకోలేదు. దాంతో ఇచ్చిన హామీల సంగతేంటంటూ ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. మరోవైపు ప్రభుత్వ ఆదాయం మాత్రం రోజురోజుకూ తగ్గుతోంది.
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడం పెద్ద సమస్యగా మారింది. పన్నులు, జీఎస్టీ వసూల్లు గత ప్రభుత్వం కంటే తక్కువగా ఉంటున్నాయి. ప్రజల వద్ద డబ్బు లేకపోవడంతో ఖర్చు తగ్గి పన్నులు కూడా తగ్గుతున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే కొత్త మార్గాలు ఏవీ కన్పించడం లేదు. అందుకే కొత్త మార్గాల కోసం అణ్వేషణలో ఉంది. వివిధ రకాల అదనపు పన్నులు, సెస్ ద్వారా 13,100 కోట్ల ఆదాయం పొందేందుకు ప్లానింగ్ చేస్తోంది. జూదం కేటగరీలో వచ్చే లాటరీలు, ఆన్లైన్ గేమింగ్‌ను అధికారికంగా అనుమతించేందుకు యోచిస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా ఆర్ధిక శాఖ వద్ద మాత్రం ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయని సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.
ఏపీలో లాటరీలపై చాలా ఏళ్ల నుంచి నిషేధం ఉంది. లాటరీలు, ఆన్లైన్ గేమింగ్స్‌పై ప్రతిపాదిత పన్ను విధించే విషయంలో న్యాయపరమైన అంశాల్ని పరిశీలించనుంది. ఇక ఒక శాతం స్టేట్ జీఎస్టీతో 4700 కోట్లు, మద్యంపై వ్యాట్, మొబైల్ ఫోన్లపై ట్యాక్స్ ద్వారా 1300 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఇక కేరళ తరహాలో స్టేట్ లాటరీల ద్వారా 3000 కోట్లు, వినోదపు పన్నుతో 2300 కోట్లు ఆర్జించే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉంది.
ప్రభుత్వం ఆలోచనలో లేదా ప్రతిపాదనలో ఉన్న పన్నులు అమల్లోకి వస్తే ఇక రాష్ట్రంలో సినిమా థియేటర్లు, పార్కులు, పర్యాటక ప్రాంతాల్లో ధరలు పెరగనున్నాయి. ఇచ్చిన ఎన్నికల హామీల అమలుకు ఏయే రకాలుగా ఆదాయం పెంచుకోవచ్చో అన్ని మార్గాల్ని పరిశీలిస్తోంది. ప్రతిపాదిత పన్ను విధానాలు అమలు చేస్తే ఆదాయం గణనీయంగా పెరగనుంది. అమరావతి రాజధాని నిర్మాణానికి సైతం నిధులు కేటాయించే వీలుంటుంది. ఆన్లైన్ గేమింగ్ అంశం మాత్రం ప్రస్తుతం ఏపీ హైకోర్టులో పెండింగులో ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి