New Ration Cards: ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ, తెలుగు దేశం, జనసేన నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కానుంది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్టు పౌరసరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
మే నెలలోపు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 74 వేల మంది దరఖాస్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో అర్హులైన వాళ్లను ప్రభుత్వ అధికారులు ఎంపిక చేసి వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నారు.
ఇందులో అధికా ఆదాయ వర్గాల వారికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ మాదిరే వైట్ కార్డ్, పింక్ కార్డ్ మాదిరే ఇక్కడ కూడా రెండు రకాల రేషన్ కార్డులు ఇష్యూ చేయబోతున్నట్టు తెలుస్తోంది. కొత్తగా ఇచ్చే కార్డులను ఏటీఎమ్ కార్డు తరహాలో చిప్ ఇన్సర్ట్ చేసి ఇవ్వనున్నారు. ఇప్పటికే ఏపీలో దశల వారీగా ఈ తరహా కార్డులను ఇష్యూ చేసే పనిలో పడింది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం. ఇక ఇపుడు కొత్తగా ఇవ్వబోయే కార్డులను కూడా ఇదే తరహాలో ఇవ్వబోతున్నట్టు సమాచారం.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









