AP Secretariat Transfers: ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్. బదిలీలకు సంబంధించిన జీవోను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు, నిబంధనలు సిద్ధమయ్యాయి. ఈ మార్గదర్శకాలపై ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు క్రమబద్ధీకరించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా సమర్ధవంతమైన పాలన అందించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. సచివాలయాల జనాభా ఆధారంగా వాటిని ఏ,బీ,సీ,డీ కేటగిరీలుగా విభజించారు. అందులో ఉద్యోగుల్ని జనరల్ పర్పస్, స్పెసిఫిక్ పర్పస్, యాస్పిరేషనల్ వర్గాలుగా చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ కేటగరీ సచివాలయాల్లో కనీసం ఆరుగురు, బీ కేటగరీలో ఏడుగురు, సి కేటగరీలో 8 మంది ఉద్యోగులు ఉండాలి. ఇక బదిలీ మార్గదర్శకాల్లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో మే 31, 2025 నాటికి ఐదేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేస్తారు. ఐదేళ్లు పూర్తి కాకున్నా ఆన్ రిక్వెస్ట్ బదిలీ చేస్తారు.
ఏ సచివాలయ ఉద్యోగి కూడా సొంత మండలంలో పనిచేయలేరు. నిర్దేశించిన అన్ని పోస్టుల్ని తప్పనిసరిగా భర్తీ చేయాల్సి ఉంటుంది. సచివాలయంలో నిర్దేశించిన సంఖ్యలో సచివాలయ ఉద్యోగుల నియామకంతో సహా అన్ని బదిలీలకు ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, నియామక అధికారులకు ఈ బాధ్యత అప్పగించారు. జూన్ 30 నాటికి ఉద్యోగుల బదిలీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. జూన్ 30 తరువాత తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు బదిలీలు అనుమతించరు. బదిలీ ప్రక్రియ పూర్తయిన తరువాత ఉద్యోగుల వివరాలను జూలై 10 నాటికి హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలి.
గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైబడి పనిచేసిన సచివాలయం ఉద్యోగులు, 40 శాతం కంటే అధిక వైకల్యం ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లకు అన్ని సదుపాయాలు ఉన్న చోటికి ఆన్ రిక్వెస్ట్ బదిలీ ఉంటుంది. ఇలా మొత్తం అన్ని నిబంధనలకు ఉద్యోగుల నుంచి అంగీకారం ఉన్నా సొంత మండలాల్లో పోస్టింగ్ ఉండదనే నిబంధనపై అసంతృప్తి చెందుతున్నారు. సొంత మండలాలు దాటి పనిచేయడం కష్టంగా ఉంటుందంటున్నారు. ప్రభుత్వం తిరిగి సొంత మండలాల్లో పనిచేసే వీలు కల్పించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.
Also read: NEET UG 2025 Results: నీట్ యూజీ 2025 ఫలితాలు, ఇలా చెక్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook









