AP 10th Exams 2025: పదో తరగతి పరీక్ష తేదీలో మార్పు, ఫలితాలు ఎప్పుడంటే

AP 10th Exams 2025: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. మరో మూడ్రోజుల్లో పరీక్షలు ముగియనున్నాయి. ఈ క్రమంలో షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 29, 2025, 11:40 AM IST
AP 10th Exams 2025: పదో తరగతి పరీక్ష తేదీలో మార్పు, ఫలితాలు ఎప్పుడంటే

AP 10th Exams 2025: ఏపీలో పదో తరగతి పరీక్షలు ముగియనున్నాయి. ముందు ప్రకటించిన షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. చివరి పరీక్ష తేదీలో మార్పు చేస్తూ ప్రకటన విడుదలైంది. ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షల వ్యాల్యుయేషన్ ప్రారంభం కానుంది. 

Add Zee News as a Preferred Source

ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. షెడ్యూల్ ప్రకారం పదో తరగతి చివరి పరీక్ష సోషల్ స్టడీస్ మార్చ్ 31న ఉంది. అయితే ఆ రోజు రంజాన్ పండుగ సెలవు కావడంతో చివరి సోషల్ పరీక్షను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ విద్యాశాఖ. మార్చ్ 31న జరగాల్సిన పరీక్షను ఏప్రిల్ 1కు వాయిదా వేసింది. మిగిలిన పరీక్షల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ లెక్కన తాజా ఉత్తర్వుల ప్రకారం సోషల్ స్టడీస్ పరీక్ష మార్చ్ 31న కాకుండా ఏప్రిల్ 1న జరగనుంది. 

సోషల్ స్టడీస్ పరీక్ష తేదీలో వచ్చిన మార్పును విద్యార్ధులు, హెచ్ఎంలు, ఇన్విజిలేటర్లు, పోలీస్ శాఖ, ట్రెజరీ సిబ్బంది, పోస్టల్ శాఖతో సహా అందరికీ తెలియజేయాలని విద్యా శాఖ ఆదేశించింది. మెటీరియల్, ప్రశ్నాపత్రాలు తీసుకునేందుకు ఈ నెల 31న పరీక్ష కేంద్రాలవైపు వెళ్లవద్దని కూడా సూచనలు జారీ అయ్యాయి. 

ఏప్రిల్ 3 నుంచి వ్యాల్యుయేషన్, ఫలితాలు ఎప్పుడంటే

పదో తరగతి పరీక్ష పత్రాల వ్యాల్యుయేషన్ ఈసారి వేగంగా జరగనుంది. ఏప్రిల్ 1న చివరి పరీక్ష ముగియగానే ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 9 వరకు ఈ ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో వ్యాల్యుయేషన్ జరగనుంది. అసిస్టెంట్ ఎగ్జామినర్లు రోజుకు 40 పేపర్లు దిద్దాల్సి ఉంటుంది. వీటిని స్పెషల్ అసిస్టెంట్లు వెరిఫై చేస్తారు. ఆ తరువాత వీటిలో 20 పేపర్ల చొప్పున చీఫ్ ఎగ్జామినర్ వెరిఫికేషన్ ఉంటుంది. అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్ కనీసం రెండు పత్రాల్ని ర్యాండమ్ చెక్ చేయాలి. ఇలా క్యాంప్ ఆఫీసర్ రోజుకు 20, డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్ రోజుకు 4 పేపర్లు వెరిఫై చేయాలి. ఈ ప్రక్రియలో ఎక్కడైనా తేడా కన్పిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోనున్నారు. ఏప్రిల్ 15 నాటికి ఫలితాలు వెల్లడి కావచ్చు.

Also read: TTD Donations: శ్రీవారిపై కనకవర్షం, 10 రోజుల్లో 30 కోట్ల విరాళాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News