Teacher Transfers Guidelines: ఏపీలో టీచర్ల బదిలీ ప్రక్రియకు శ్రీకారం, మార్గదర్శకాలు, తుది జాబితా సిద్ధం

Teacher Transfers Guidelines: ఆంధ్రప్రదేశ్‌లోని టీచర్లకు గుడ్‌న్యూస్. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బదిలీలకు రంగం సిద్ధం చేస్తోంది. టీచర్ల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు, తుది జాబితా దాదాపుగా ఖరారైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 8, 2025, 10:02 PM IST
Teacher Transfers Guidelines: ఏపీలో టీచర్ల బదిలీ ప్రక్రియకు శ్రీకారం, మార్గదర్శకాలు, తుది జాబితా సిద్ధం

Teacher Transfers Guidelines: ఏపీలో త్వరలో ఉపాధ్యాయుల బదిలీలు జరగనున్నాయి. రాష్ట్రంలోని టీచర్లు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆ తరుణం వచ్చేసింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 117 రద్దు చేసి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. 

Add Zee News as a Preferred Source

ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలు చేపట్టింది. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు బదిలీల కోసం మార్గదర్శకాలు ఖరారు చేసింది. వచ్చే నెలలో అంటే మేలో రాష్ట్రవ్యాప్తంగా టీచర్ల బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా మొత్తం ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బదిలీల కోసం కూటమి ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. పాత చట్టం జీవో నెంబర్ 117 రద్దు చేసింది. ఆదర్శ ప్రాధమిక పాఠశాల విధానానికి అనుగుణంగా టీచర్లను సర్దుబాటు చేయనున్నారు. రాష్ట్రంలో ఇకపై 1-5 వ తరగతులకు ఐదు మంది ఉపాధ్యాయులుంటారు. 

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7500 ఆదర్శ ప్రాధమిక పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు. వార్డు, గ్రామ పంచాయితీకు ఒక పాఠశాల ఏర్పాటు కానుంది. ఏప్రిల్ 30 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఉపాధ్యాయుల బదిలీల కోసం ఇప్పటికే సిద్ధం చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా సీనియారిటి జాబితాను ఏప్రిల్ 20 నాటికి సిద్ధం చేయనున్నారు. ఇప్పటికే ఈ జాబితాకు సంబంధించి అభ్యంతరాలు స్వీకరించారు. త్వరలో తుది జాబితా ఖరారు కానుంది. 

మే నెల మొదటి వారంలో టీచర్ల బదిలీలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ కానుది. ఆర్ధిక శాఖ నుంచి వచ్చిన అనుమతి ఆధారంగా బదిలీల ప్రక్రియ ఉంటుంది. మొత్తం విధానం ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఖాళీల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నమోదు చేసుకోవాలి. ఒక టీచర్ ఎన్ని ఖాళీలకైనా ఆప్షన్ పెట్టుకోవచ్చు. సీనియారిటీ, రిజర్వేషన్ రోస్టర్ ఆధారంగా పోస్టుల కేటాయింపు ఉంటుంది. తప్పనిసరి బదిలీ అయ్యే ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న స్కూల్స్‌ను ఎంపిక చేసుకోకూడదు. రెండేళ్లు సర్వీసు నిండి ఉండాలి. 

టీచర్ల బదిలీల్లో ముందుగా ప్రధానోపాధ్యాయులకు బదిలీ ఉంటుంది. ఆ తరువాత స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పిస్తారు. స్కూల్ అసిస్టెంట్లకు బదిలీల తరువాత ఎస్జీటీ పదోన్నతులు ఉంటాయి. ఆ తరువాత ఎస్జీటీలకు బదిలీలు ఉంటాయి. ఇక చివరిగా మిగిలే ఖాళీల్లో డీఎస్సీ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. మే 30 నాటికి మొత్తం బదిలీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. 

Also read: AP Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో రానున్న 4 రోజులు వర్షాలే

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News