AP Schools Final Exams: వేసవి సెలవులొచ్చేశాయి ఏప్రిల్ 7 నుంచి పరీక్షలు తరువాత సెలవులే

AP Schools Final Exams: విద్యార్ధులకు బిగ్ అప్‌డేట్ ఇది. ఏపీలో స్కూల్ విద్యార్ధుల వార్షిక పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. అటు వేసవి సెలవులు ఎప్పుడో ఖరారైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 27, 2025, 02:57 PM IST
AP Schools Final Exams: వేసవి సెలవులొచ్చేశాయి ఏప్రిల్ 7 నుంచి పరీక్షలు తరువాత సెలవులే

AP Schools Final Exams: ఏపీలో పదో తరగతి పరీక్షలు మరో రెండ్రోజుల్లో ముగియనున్నాయి. ఆ తరువాత ఇక ఒకటి నుంచి 9వ తరగతి పరీక్షలు జరగాల్సి ఉన్నాయి. స్కూల్ విద్యార్ధుల ఎస్ఏ 2 పరీక్షల షెడ్యూల్ ఇప్పుడు విడుదలైంది. ఈ పరీక్షలు ముగిసిన వెంటనే వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. 

Add Zee News as a Preferred Source

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్ధులకు  సమ్మేటివ్ అసెస్‌మెంట్ 2 పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. ఏప్రిల్ 7 నుంచి 17 వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. 1 నుంచి 8వ తరగతి విద్యార్ధులకు రోజూ ఉదయ 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి. ఇక 9వ తరగతి విద్యార్ధులకు మాత్రం ఉదయం 9 గంటల నుంచి 12.15 గంటల వరకు జరగనున్నాయి. 9వ తరగతి పరీక్షల విధానం పదో తరగతి పబ్లిక్ పరీక్షల మాదిరి ఉన్నందున టైమింగ్స్ ప్రత్యేకంగా ఉంటాయి. 

ఏప్రిల్ 17న పరీక్షలు ముగిసిన వెంటనే పరీక్ష పత్రాల మూల్యాంకనం కూడా ఎక్కడికక్కడ జరుగుతుంది. ఏప్రిల్ 19 నాటికి వ్యాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి చేసి 21న విద్యార్ధులకు అందిస్తారు. తల్లిదండ్రుల సంతకాలు పూర్తయ్యాక ఏప్రిల్ 23న వాటిని సేకరించి పై తరగతులకు ప్రమోట్ చేస్తారు. ఆ తరువాత ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభమౌతాయి. ఈ ఏడాది వేసవి సెలవులు జూన్ 11 వరకు ఉంటాయి. జూన్ 12న తిరిగి పాఠశాలలు తెర్చుకుంటాయి.

ఇక వచ్చే విద్యా సంవత్సరం అంటే 2025-26 నుంచి ఏపీ ఇంటర్మీడియట్‌లో NCERT సిలబస్ ప్రవేశపెట్టనున్నారు. అంటే ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్ధులకు అమల్లోకి వస్తుంది. ఈ విధానం వల్ల జేఈఈ మెయిన్, నీట్ పరీక్షలకు సిద్ధమౌతున్న విద్యార్ధులకు చాలా సులభమౌతుంది. 

Also read: 8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్, ఎప్పుడు అమలవుతుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News