AP Fibernet Issue: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఎత్తున కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగించింది. ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న 248 మందిని ఒక్కసారిగా తొలగించడంతో ఫైబర్ నెట్ కార్యకలాపాలపై తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రభుత్వం నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ పైబర్ నెట్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న 248 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను ఒక్కసారిగా ప్రభుత్వం తొలగించింది. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ఉద్యోగులు వీరంతా. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే తొలగించాలని అనుకున్నా నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమైంది. అవుట్ సోర్సింగ్ సంస్థతో ఉన్న ఒప్పందాన్ని కూడా రద్దు చేశారు. ఏకంగా 248 మంది ఉద్యోగుల్ని ఒక్కసారిగా తొలగించడంతో ఫైబర్ నెట్ కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. టెక్నికల్ పరిజ్ఞానం ఉన్న ఉద్యోగులు కావడంతో సంస్థ మూతపడే స్థితి తలెత్తింది. వీరిలో చాలామంది వైజాగ్ నెట్ వర్క్ ఆపరేషన్ సెంటర్ లో పనిచేస్తున్నారు. ఇప్పుడు వీరందరినీ తొలగించడంతో ఏదైనా టెక్నికల్ సమస్య తలెత్తితే పరిష్కరించేవాళ్లు లేకుండా పోయారు.
కొత్త సిబ్బందిని నియమించడం లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా భారీగా ఉద్యోగుల్ని తొలగించడంపై విమర్శలు వస్తున్నాయి.. 2014-19 మధ్యన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ప్రస్తుతం అప్పుల్లో కూరుకుంది. గత ప్రభుత్వ హయాంలోనే 2,171 కోట్ల అప్పు మిగిలింది. ఇక కనెక్షన్లు అయితే 12 లక్షల నుంచి 5 లక్షలకు పడిపోయాయి.
గత ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగిందనేది కూటమి ప్రభుత్వం ఆరోపణ. గత ప్రభుత్వ హయాంలో 5400 కోట్ల ఆర్ధిక లావాదేవీలు జరిగితే అందులో 500 కోట్ల అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా గుర్తించారు.
Also read: AB venkateswara rao: జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఐపీఎస్ అధికారి, త్వరలో రాజకీయాల్లో ఎంట్రీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









