AP Ration Shops: రేషన్ సరుకుల పై ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం.. ఇకపై షాపుల్లోనే రేషన్ సరుకుల పంపిణీ..

AP Ration Shops: ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ షాప్స్ ద్వారా రేషన్‌ సరుకుల పంపిణీ చేయనున్నారు. దీని కోసం 29వేల 796 చౌక ధర దుకాణాలను ఏర్పాటు చేశారు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 1, 2025, 10:22 AM IST
AP Ration Shops: రేషన్ సరుకుల పై ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం.. ఇకపై షాపుల్లోనే రేషన్ సరుకుల పంపిణీ..

AP Ration Shops: ఇకపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో  ఆదివారం సరుకుల పంపిణీ ఉంటుందని... ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. ఒక నెలలో మొదటి 15 రోజులు రెండుపూటలా సరుకులు పంపిణీ చేయబోతున్నారు. ముఖ్యంగా దివ్యాంగులు అలాగే 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు మాత్రం...ఇంటి వద్ద రేషన్ అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం జనసేనాని అధినేత ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి  పిఠాపురం నుంచి ప్రారంభం కానున్నండటం విశేషం.

Add Zee News as a Preferred Source

పేదల ఇబ్బందులను తొలగించేలా చౌకధరల దుకాణాల్లో నెలలో 15 రోజులు రెండు పూటలా సరకులు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీని వల్ల ప్రతి కుటుంబానికీ సరకులు అందనున్నాయని తెలిపింది. వీలైనప్పుడు వెళ్లి తీసుకునేందుకూ ఆస్కారం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు. 

‘గత ప్రభుత్వం ఇంటింటికీ రేషన్‌ అందిస్తామంటూ 1వేయి 6వందల కోట్లతో వాహనాలు కొనుగోలు చేసింది. కూడలిలో వాహనం నిలిపి ఒకటి రెండు రోజులే రేషన్‌ అందించేది. మిగిలిన బియ్యం, సరకులను అక్రమంగా ఎగుమతి చేసేదని ఆరోపించారు. అక్రమంగా మళ్లించిన వేల టన్నుల బియ్యం కాకినాడ, విశాఖ పోర్టుల్లో పట్టుబడ్డాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 

Also Read:  NTR Sensational Record: తెలుగులో మరే ఇతర హీరోలు బ్రేక్ చేయని రికార్డు సాధించిన అన్న ఎన్టీఆర్..


Also Read:  Nandamuri Heroes: నందమూరి మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఈ సినిమా తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News