AP Government: ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్‌లో ముఖ్యమైంది తల్లికి వందన పధకం. వాస్తవానికి గత ఏడాదే ప్రారంభం కావల్సి ఉన్నా ఆర్ధికపరమైన కారణాలతో ఆలస్యమైంది. ఇప్పుడు ఈ విద్యా సంవత్సరంలో ఈ పధకం అమలు కానుంది. కానీ కొన్ని ముఖ్యమైన ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఏపీ ప్రభుత్వం అందించనున్న తల్లికి వందనం పధకంలో భాగంగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో 15 వేలు డబ్బులు పడాలంటే జూన్ 5 అంటే రేపటిలోగా కీలకమైన ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ రెండు పనులు రేపటిలోగా పూర్తి చేయకపోతే తల్లికి వందన డబ్బులు పడవు. ముఖ్యంగా ప్రతి తల్లి తమ ఎక్కౌంట్‌ను ఆధార్ కార్డుతో లింక్ చేయాలి. రెండవది బ్యాంక్ ఎక్కౌంట్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో లింక్ చేయాలి. ఈ రెండు లింకింగ్ ప్రక్రియలు పూర్తయితేనే తల్లుల ఎక్కౌంట్లలో 15 వేలు డబ్బులు జమ అవుతాయి. లింక్ చేసేందుకు రేపు జూన్ 5 చివరి తేదీ. లింకింగ్ ప్రక్రియ పూర్తి కాకపోతే తల్లికి వందన పధకం కింద 15 వేలు జమ కావని ప్రభుత్వం స్పష్టం చేసింది.
బ్యాంక్ ఎక్కౌంట్‌ను ఆధార్, ఎన్‌పీసీఐతో ఎలా లింక్ చేయాలి
దీని కోసం మీ బ్యాంక్‌ను లేదా పోస్టాఫీసు లేదా గ్రామ, వార్డు సచివాలయాన్ని సందర్శించాలి. ఎన్‌పీసీఐ స్టేటస్ చెక్ కోసం htts;//www.npci.org.in ద్వారా చూడవచ్చు.
తల్లికి వందన పధకంలో భాగంగా స్కూల్ చదివే విద్యార్ధుల తల్లిదండ్రుల ఖాతాల్లో ఏడాదికి 15 వేలు జమ అవుతాయి. ఈ విద్య సంవత్సరం స్కూల్స్ ప్రారంభయ్యేలోగా ఈ నిధులు జమ కానున్నాయి. అటు ఆధార్ ఇటు ఎన్‌పీసీఐ అనుసంధానం తప్పకుండా రేపటిలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
Also read: IPL 2025: పంజాబ్ ఎందుకు ఓడిపోయింది, ఇవే కారణాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook









